అసలు దోషి ‘మెఘా’ అంటున్న కవిత|KAVITA KALVAKUNTLA
L & T|ఎల్ అండ్ టీకి NOTICE|నోటీసులు!
‘మెఘా’కి ఎందుకు ఇవ్వలేదు?
KALESHWARAM|కాళేశ్వరం COMMISSION|కమిషనా? CONGRESS|కాంగ్రెస్ కమిషనా?
కవిత తన ఆరోపణలపై చివరి దాకా నిలబడతారా?
తనవి వట్టిమాటలు కావని గట్టిమేలు తలపెడతారా?
CM|సీఎం REVANTH REDDYరేవంత్ సీరియస్ గా తీసుకుంటారా?
కవిత QUESTIONS|ప్రశ్నలకు GOVERNMENT|ప్రభుత్వం జవాబిస్తుందా?
ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటుందా?
కేసీఆర్ కు నోటీసులు రాజకీయ దురుద్దేశం కావచ్చు. కాబట్టి కవిత ఆరోపిస్తున్నట్లు ఎల్ అండ్ టి లాగే మెఘాకు కూడా నోటీసులు ఇచ్చి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవసరమైతే అప్పుడు ఆయా కంపెనీలతోపాటు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లను కూడా కలిపి విచారించవచ్చు. అవినీతి జరిగి ఉంటే బయట పడుతుంది. ప్రజలకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. అవినీతి జరగకపోయి ఉంటే అప్పటి ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ నిజాయితీ నిలబడుతుంది. కవిత ఆరోపణల ప్రకారం అది కాళేశ్వరం కమిషనా? లేక కాంగ్రెస్ కమిషనా? లేక రాజకీయ కమిషనా? కూడా తేలిపోతుంది. రాజకీయ ఆరోపణలు, రాజకీయ నేతల మీద కేసులు ఎప్పటికీ నిలవవు అన్న ఒప్పు కూడా తప్పై, ప్రజలకు రాజకీయాలు, నాయకుల విలువల మీద గౌరవం పెరుగుతుంది. మరి ఇప్పుడా చిత్తశుద్ధిని పాలక, ప్రతిపక్షాలు, తాజా, మాజీ సీఎంలు ప్రదర్శిస్తారా? ఫక్తు రాజకీయ నేతలుగానే మిగిలిపోతారా? తేల్చుకోవాలి. లేకపోతే వారి లెక్కలను ప్రజలు తేల్చేస్తారు.
నిజంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అభినందించాలి. అమె గట్స్ కు జోహార్లు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణలో విచారణ కమిషన్ సహా, ఎవరూ పెద్దగా పట్టించుకోని లేదా విస్మరించిన మెఘా కంపెనీని ముగ్గులోకి లాగారు. మెఘాకి నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. మెఘాకి నోటీసులు ఇచ్చే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని నిలదీశారు. ‘రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులిచ్చారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రు? గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కంపెనీకి ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలి’ అని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా హైదరాబాద్ లో మహా ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు.
మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన తెలంగాణ సాంస్కృతిక సారథి జాగృతి సుప్రీం కవిత. అంతేకాదు తొమ్మిదిన్నర ఏళ్ళపాటు సీఎంగా పని చేసిన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న బిడ్డ. ఆమె గతంలో నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి. కాబట్టి కవిత వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేం. కొట్టిపారేయలేం. ఆమె నేపథ్యం, ప్రజా ప్రాతినిధ్యం ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను చేకూరుస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఫిబ్రవరిలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నిర్మాణాల లోపాలపై విచారణ కోసం సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా కమిషన్ ను నియమించింది. ఈ విచారణ జరుగుతుండగానే, విజిలెన్స్ విచారణ రిపోర్టు ఇచ్చింది. మరోవైపు ఎన్డీఎస్ఎ నివేదిక అంద చేసింది. ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ లకు నోటీసులు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఎల్ అండ్ డి సంస్థపై, 57 మంది ఇంజనీరింగ్ అధికారులపై క్రిమినల్ చర్యలు, జరిమానాలు, రికవరీకి విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
మెఘాకి నోటీసులివ్వాల్సిందే
లక్ష కోట్ల నిధులతో ప్రపంచంలోనే అతి పెద్దదిగా, అతి తక్కువ కాలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఎల్ అండ్ టి తోపాటు మెఘా కంపెనీలు చేశాయి. అయితే కేవలం ఎల్ అండ్ టికి, కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు మాత్రమే నోటీసులిచ్చిన కమిషన్, ఆ ప్రాజెక్టులోని ఎక్కువ పనులు చేసిన మెఘా కంపెనీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒక విధంగా విజిలెన్స్ ప్రకారం తక్కువ పనులు చేసిన ఎల్ అండ్ టి అవినీతికి పాల్పడినట్లు తేలితే, ఎక్కువ పని చేసిన మెఘా కూడా అవినీతికి ఒడిగట్టినట్లే అవుతుందా? ఎక్కువ పనులు చేసిన కంపెనీని వదిలేసి విచారణ చేపట్టడం కూడా అనైతికం. కాబట్టి కవిత చేసిన ఆరోపణలను ఏ విధంగానూ తీసిపారేయలేం. కవిత ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని వెంటనే మెఘాపై కూడా విచారణకు ఆదేశించాలి. నోటీసులివ్వాలి. తప్పు చేస్తే శిక్షించాల్సిందే.
అయితే, ఎమ్మెల్సీ కవిత కూడా ఏదో ధర్నాలో రాజకీయ ఆరోపణలు చేసినట్లు కాకుండా, తనవి వట్టి మాటలు కాదు. గట్టి మాటలేనని నిరూపించే విధంగా చివరి దాకా తన మాట మీద నిలబడాలి. మెఘా మీద కేసులు పెట్టేదాకా లేదంటే, కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణ జరిపేదాకా వెంటపడాలి. ప్రజల్ని చైతన్య పరచాలి.
తన మాటపై చివరికంటా కవిత నిలబడతారా?
ఇప్పుడు కవిత తన తండ్రికి, మేన బావకి నోటీసులు ఇచ్చారు కాబట్టి, వారి పరువు ప్రతిష్టల కోసం, వారికి మద్దతుగా మహా ధర్నాలకు, ఆందోళనలకు దిగుతున్నారన్న అపవాదును పోగొట్టుకుని, నిజమైన ప్రజానాయకురాలిగా నిలవాలంటే, మెఘాపై కేసులు పెట్టేదాకా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. అందుకు అవసరమైన పోరాటాలు చేయాలి. ప్రభుత్వాన్ని నేలకు దించి, ప్రజా ధనాన్ని కాపాడాలి.
ప్రభుత్వం, సీఎం రేవంత్ చిత్తశుద్ధిని చాటుకుంటారా?
ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా కవిత చేసిన ఆరోపణలను గౌరవించాలి. ఆమె మాటలకు విలువ ఇవ్వాలి. ఆ విధంగా ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటున్న రేవంత్ తన ప్రభుత్వ పారదర్శకతను మెఘాపై చర్యల ద్వారా ప్రదర్శించాలి. ఇప్పటి దాకా కేవలం ఎల్ అండ్ టికి మాత్రమే నోటీసులు వెళ్ళాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ లకే నోటీసులు వెళ్ళాయి. దీంతో కాలేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అని, రాజకీయ కమిషన్ అనే ఆరోపణలకు ఆస్కారం ఏర్పడింది. నిజంగానే అది కాళేశ్వరం కమిషన్ అని నిరూపించుకోవాలనుకుంటే, కచ్చితంగా మెఘా కంపెనీకి నోటీసులివ్వాలి. దోషిగా తేలితే కఠినంగా శిక్షించాలి. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. కాళేశ్వరం కమిషన్ ద్వారా తాను రాజకీయ కక్ష తీర్చుకోవడం లేదని, అవన్నీ ఆరోపణలేనని కూడా ప్రజలకు అర్థం చేసినట్లు అవుతుంది. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తాను రాజకీయ కక్షలకు వెళ్ళడం లేదని చెప్పి ఉన్నారు. అదే నిజమైతే ఇప్పుడు కచ్చితంగా మెఘాకు నోటీసులు ఇవ్వాల్సిందే.