ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అద్భుత విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు అద్భుత ప్రదర్శన చేయడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్‌గా భారత జట్టు మరోసారి తన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, అందరు టీమిండియా ఆటగాళ్లను అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.