ఇప్పుడు మాత్రం అన్ని నువ్వే చేసావా….
అబద్దాలు చెప్తే ప్రజలు నమ్ముతారా…
చిల్లర ప్రచారాలు మానుకో….
ఎర్రబెల్లిని హెచ్చరించిన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గానికి వస్తున్న సాగు నీటి కాలువలను పాలకుర్తి మండల శివారులో బోయిగూడ, ఈరవెన్ను, కోతులాబాద్ గ్రామాల్లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కోతులాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… రెండు రోజుల క్రితం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో పంటపొలాలకు నీరు అందడం లేదని, పంటపొలాలు ఎండిపోతున్నాయి అని తానే అధికారులకు మాట్లాడినట్టు తన వల్లే కాలువలకు నీళ్లు వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసుకోవడం మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆపాలని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఎంఎల్ఏ అమెరికాలో వున్న సరే ప్రతిరోజూ అధికారులతో మాట్లాడి కాలువల ద్వారా సాగునీరు తీసుకొస్తే అన్ని తానే చేసినట్టు పాలాభిషేకాలు చేయించుకోవడం తగదన్నారు. మేము ఎల్లప్పుడు రైతుల కోసం, రైతుల సమస్యలను తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. గత పాలకుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత పది సంవత్సరాలు పరిపాలించి, అప్పుడు రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు తానే అన్ని చేస్తున్నట్లు పంట పొలాల వద్దకు వచ్చి విమర్శించడం ఆయన అలవాటయింది అన్నారు. మేము చెప్పింది చేస్తామని, ఇది మేమే చేశామని ప్రచారం చేసుకోమని ప్రజలు అది అర్థం చేసుకుంటారని తెలియజేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు తీసుకొచ్చి ఏదో అభివృద్ధి చేశానని చెప్పాడు తప్ప ఏం చేశాడో చెప్పాలన్నారు. అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడే ఏదో చేసానంటే ఇక్కడ ప్రజలు ఎవరు తెలివి తక్కువ వారు కాదన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో తాను మాట్లాడానని చెప్తున్నాడని, మంత్రి ఉత్తమ్ తో గత పది రోజులుగా మాట్లాడుతున్నది మేమేనన్నారు. గత పది రోజులుగా మా నాయకులు మా ఆదేశాల మేరకు అధికారుల వెంట ఉండి ఉండి నీళ్లు విడుదల చేయించారు అన్నారు. ఆయన నిజంగా మాట్లాడితే ఆ ఆడియో రికార్డును గాని, వీడియో రికార్డును కానీ విడుదల చేయాలన్నారు. రైతుల విషయంలో ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేస్తే ప్రజలు ఊరుకోరు అన్నారు. ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారని, మళ్లీ తనకేదో ఉందని పిచ్చి ప్రచారాలు చేసుకుంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ప్రజల మనస్సులు అర్థం చేసుకొని రాజకీయాలకు దూరంగా వుంటే బాగుంటుందని ఎర్రబెల్లికి సూచన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.