తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అని రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. కుల గణన చేపట్టి, స్థానిక సంస్థలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. పార్లమెంట్ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని బలపరచడం కీలకమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా, తెలంగాణ మిగులు సాధించేందుకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు.