రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన వివరాల ప్రకారం, గత సర్వేలో పాల్గొనని 3.1% మందికి మరో అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఈ నెల 16 నుంచి 28 వరకు కొత్త సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సర్వేలో నమోదు అయినంత మాత్రానే రాష్ట్ర జనాభా లెక్కల్లో వారి పేర్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కులగణన సర్వే సమగ్రంగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.