పాడి రైతులకు భారత్ బయోటెక్‌కు చెందిన బయోవెట్ కంపెనీ శుభవార్త అందించింది. BIOLUMPIVAXIN® అనే కొత్త వ్యాక్సిన్ CDSCO అనుమతి పొందిందని కంపెనీ ప్రకటించింది. భారత్‌తో పాటు ప్రపంచంలోనే ఇదే తొలి DIVA మార్కర్ LSD టీకా అని వివరించారు.
ఈ DIVA టీకా ప్రత్యేకత ఏమిటంటే, వ్యాధి సోకిన మరియు టీకా తీసుకున్న జీవులను వేర్వేరుగా గుర్తించగలదు. మేకలు, ఆవులు, బర్రెలకు పెద్ద సమస్యగా మారిన ముద్దచర్మం (Lumpy Skin Disease – LSD) వ్యాధి నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుందని బయోవెట్ తెలిపింది.
ఈ టీకా ద్వారా పశుసంవర్ధక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.