వాచ్‌మెన్ కూతురిపై డ్రైవర్ అత్యాచారం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లో ఓ డ్రైవర్ పెళ్లికి సాయం చేస్తానని నమ్మించి 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగిందని, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌లోని ఓ బంగ్లాలో వాచ్‌మెన్ తన 19 ఏళ్ల కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే బంగ్లాలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, యువతికి పెళ్లికి సహాయం చేస్తానని నమ్మబలికాడు. ఆదివారం రాత్రి, యువతి ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె గదిలోకి చొరబడి పెళ్లి విషయం మాట్లాడుతూ మోసగించాడు. అనంతరం బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేసి, నోరు నొక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధిత యువతి అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలో అరెస్ట్ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.