ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు పాల్గొననున్నారు. రాష్ట్రపతి కార్యాలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. 26 రోజులుగా కొనసాగుతున్న ఈ మహోత్సవంలో ఇప్పటి వరకు సుమారు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేసినట్లు సమాచారం.