పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌లో అంతర్గత రాజకీయాల నేపథ్యంలో, కేజ్రీవాల్ త్వరలో పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్‌ను స్థానచలనం చేయవచ్చని బజ్వా అభిప్రాయపడ్డారు. ఇటీవల, పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా కూడా పంజాబ్‌లో హిందూ వ్యక్తి ముఖ్యమంత్రిగా అవుతారని పేర్కొన్నారని బజ్వా గుర్తుచేశారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఆప్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, గతంలో బజ్వా కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.