యదాద్రి జిల్లా భువనగిరిలో ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా, టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రితో మాట్లాడిన సందర్భంగా, తీన్మార్ మల్లన్న విషయంలో మాట్లాడేంత సమయం లేదని, అందుకు సమయం వృథా అని తెలిపారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, 56.6 శాతం బీసీల జాబితా ఉన్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వర్గీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. 90 శాతం జనాభా కోసమే తెలంగాణ ఏర్పడిందని మంత్రిచెప్పారు