అధికారులకు శిక్షణ ప్రారంభం..!
ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రచిస్తుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో ఎన్నికలపై సన్నాహాలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు నేడు శిక్షణను మొదలుపెట్టింది. వీరి తర్వాత టీచర్లకు ట్రైనింగ్ ఉండనుంది.