ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభమేళా 2025లో భాగంగా ఈరోజు ప్రయోగ రాజ్ లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్న మోదీ, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ప్రధాని చేతిలో రుద్రాక్ష మాల పట్టుకుని మంత్రోచ్చారణ చేస్తూ స్నానం చేశారు. మోదీ రాకను గుర్తిస్తూ, ఘాట్ వద్ద భక్తులు ఆయనకు గట్టిగా స్వాగత నినాదాలు చేశారు. మోదీ ఈరోజు ప్రయాగ రాజ్ లో సుమారు రెండున్నర గంటల పాటు బస చేశారు.
2019 కుంభమేళాలో ప్రధాని మోదీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన బడే హనుమాన్ ఆలయం, అక్షయవట సందర్శించారు. ఫిబ్రవరి 5, భీష్మాష్టమిగా పిలువబడే ఈరోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైనది. మహాభారతంలో భీష్ముడు తన జీవితాన్ని త్యజించిన పవిత్రమైన రోజు కావడంతో, ఈ రోజున ఉపవాసం, పూజలు, ధ్యానం చేయడం పుణ్యఫలాలను ఇస్తుందని విశ్వాసం.