కొనసాగుతున్న కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం సభలో ప్రస్తావించనుంది. ఇందుకు ముందుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, భేటీ కొనసాగుతుండటంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అసెంబ్లీని వాయిదా వేయాలని కోరారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
- ఎస్సీ వర్గీకరణ – శాతం విభజన
- గ్రూప్ 1: అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలు, సంచార కులాలు – 1%
- గ్రూప్ 2: మాదిగ, మాదిగ ఉపకులాలు – 9%
- గ్రూప్ 3: మాల, మాలవ కులాలు – 5%
జరిగిన కీలక పరిణామాలు
- 10:40AM – అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం
- 11:03AM – తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
- 11:05AM – కేబినెట్ భేటీ కొనసాగుతుండటంతో అసెంబ్లీని వాయిదా వేయాలని అభ్యర్థన
- 11:07AM – తెలంగాణ అసెంబ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
అంతకుముందు, సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరి 10:30AMకి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు మంత్రులు భేటీకి హాజరయ్యారు.