తెలంగాణ బీజేపీ జిల్లాల అధ్యక్షులను మార్చుతూ కొత్త నియామకాలు చేసింది. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డిని, భూపాల్‌పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డిని నియమించారు. కామారెడ్డి జిల్లా బీజేపీ బాధ్యతలను నీలం చిన్న రాజులకు అప్పగించారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్ నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు నాగం వర్షిత్ రెడ్డి, జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరిబాబును పార్టీ నాయకత్వం నియమించింది. తాజా నియామకాలతో బీజేపీ తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.