అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడా దిగుమతులపై భారీ సుంకాలు విధించిన కొన్ని గంటల్లోనే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రతిస్పందించారు. అమెరికా నుంచి దిగుమతయ్యే 155 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.
ట్రంప్ పాలనలో, కెనడా మరియు మెక్సికో నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై 25% పన్ను విధించనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కెనడియన్ ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు ఈ నిర్ణయం నుండి మినహాయింపు ఉంది. తాజా పరిణామాలతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత కఠినతరం అయ్యే అవకాశముంది.