పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ శాఖలో పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా? ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.