వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో లారీ నుంచి రైలు పట్టాలు జారీ రెండు ఆటోల పై పడటంతో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరు రైలు పట్టాల కింద ఇరుక్కుపోయినట్ల సమాచారం. మృతులంతా కూడా రెండు కుటుంబాలకు చెందిన 11 మందిగా ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా కూడా వలస కూలీలే కావడం గమనార్హం. మృతుల్లో ఇద్దరు మహిళలు..ఇద్దరు చిన్నారులున్నారు. లారీ ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తుండగా పంథిని నుంచి వస్తున్న రెండు ఆటోలను ఓవర్టేక్ చేయబోయే క్రమంలో లారీ డ్రైవర్ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. భారీ ప్రమాదం కావడంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.