మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కాసేపటి క్రితం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన సేవలను చిరస్మరణీయమని ప్రశంసించారు. సత్యనారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.