ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ ఇల్లు, కార్యాలయాలపై దాదాపు 16 ఏళ్ల తర్వాత జరిగిన ఐటీ దాడుల గురించి స్పందించారు. గడిచిన నాలుగు రోజులుగా తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన తనిఖీలపై మీడియా ఊహాగానాలు పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపార రంగంలో ఇలాంటి దాడులు సాధారణమని, కానీ తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తమ వద్ద ఎలాంటి అక్రమ డబ్బు లేదా అనధికారిక డాక్యుమెంట్లు లేవని స్పష్టం చేశారు. కొన్ని ఛానెల్స్ అనవసరంగా హైలైట్ చేస్తున్నాయని దిల్ రాజు అన్నారు.