పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో వివిధ గ్రామాల్లో బాధిత మృతుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయం చేసి, వారి కుటుంబానికి భవిష్యత్‌లో కూడా వారికి చేయూతగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ… ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములుగా ఉండేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.