కల్లు గీత కార్మికులకోసం రెండో దశలో 10,000 కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ఈనెల 25 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15,000 మందికి కిట్లు అందించామని ఆయన తెలిపారు. గత ఏడాది జూలై 14న రంగారెడ్డి జిల్లా లష్కర్ గూడలో ముఖ్యమంత్రి రేవంత్ చేతులమీదుగా కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కిట్లు కార్మికుల భద్రత కోసం ముఖ్యంగా రూపొందించబడ్డాయని, ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.