ఫార్ములా-ఈ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మాజీ మంత్రి, భారతరాష్ట్ర సమితి (భారస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎస్ఈవో) మధ్య కుదిరిన ఒప్పందంలో ఉల్లంఘనలపై ఏసీబీ దృష్టి సారించింది.
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించిన ఏసీబీ, సమగ్ర అధ్యయనంలో ఒప్పందంలో కీలకమైన ఉల్లంఘనలను గుర్తించింది. సంబంధిత నిబంధనలను ఉల్లంఘించడంపై ప్రాథమిక దర్యాప్తులోనే అస్త్రాలు బయటపడగా, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన మేనేజింగ్ కమిటీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 జనవరిలోనే ఒప్పందం కుదిరినప్పటికీ, సంబంధిత దస్త్రాలు ఎంఏయూడీ ఆధీనంలో లేవని తేలింది.
అక్టోబరులో జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో కూడా సీజన్-9 రేస్ కోసం ఖర్చు చేసిన నిధులకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం దర్యాప్తులో ప్రధాన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసులో ప్రధానంగా నిందితులను విచారించి, నిర్ధారణకు ఏసీబీ నోటీసులు పంపింది.