ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కన్హ గ్రామంలో ఉన్న కన్హ శాంతి వనాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రికి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హృదయపూర్వక స్వాగతం పలికారు.
సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గలిబుడ (Hildegardia populifolia) మొక్కను నాటి ప్రకృతి పరిరక్షణకు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అనంతరం శాంతి వనంలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలు, చెట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వనంలో ఉన్న ప్రకృతి సౌందర్యం, పచ్చదనాన్ని ఆస్వాదించారు.
ఆ తరువాత ఆశ్రమంలోని ధ్యాన కేంద్రాన్ని సందర్శించి అక్కడి శాంతి మయమైన వాతావరణాన్ని కూడా ఆస్వాదించారు. ప్రకృతిని పరిరక్షించడంలో శాంతి వనం చేపడుతున్న కృషిని ప్రశంసించారు. వనంలో సృష్టించిన సౌందర్యం, పర్యావరణ హిత సదుపాయాల పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.