భిక్కనూర్‌లో జరిగిన ఆత్మహత్య కేసులో తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు చాటింగ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఒకరిని ఒకరు కాపాడుకోవాలని, చివరికి వీరు ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకోవాలని ముందస్తు ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాలు వారి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్లో బయటపడినట్లు తెలుస్తోంది. పోలీసులు పేర్కొన్నట్లు, ఎస్ఐ దగ్గర ఉన్న మూడు ఫోన్లలో ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ కాగా, మిగతా రెండింటిని తెరవలేకపోయారు. ఫోన్ చాటింగ్ ఆధారంగా కేసు క్లారిటీకి వచ్చి నిజాలు బయటపడవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 26న అర్థరాత్రి 1:26 గంటలకు ముగ్గురి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించిన పోలీసులు, మరిన్ని వివరాలు సేకరించేందుకు సీసీ కెమెరా ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం, ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు, కానీ చనిపోతున్న సమయంలో ఏవైనా గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, ఎస్ఐ ఫోన్లు ఓపెన్ చేయడంతో అసలు కారణాలు వెలుగులోకి రాగలవని భావిస్తున్నారు.