యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్కో’ (Marco) తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా, హనీఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి వారంలో రూ.80 కోట్ల పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1న తెలుగు వెర్షన్ విడుదలకానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చూపించి, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి స్పందనను అందుకోబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.