సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రయాణించే ప్రజలు బస్సుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్తను ప్రకటించింది. 2024 సంక్రాంతి పండగ సందర్భంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే ప్రయాణికుల కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు హైదరాబాద్ MG బస్ స్టేషన్ (MGBS) వద్ద ఉన్న పాత సెంట్రల్ బస్ స్టేషన్ (CBS) నుంచి బయలుదేరతాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వంటి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక, సాధారణ బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఈసారి, ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయదు. పండగ సమయాల్లో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.