తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెండు రోజులు కర్ణాటకలోనే ఉండనున్నారు. రేపటి నుండి బెల్గాం లో జరుగనున్న CWC సమావేశాలకు తెలంగాణ నుంచి ముఖ్య నేతలు పాల్గొనడానికి వెళ్లనున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని రెండు రోజులు బెల్గాంలోనే ఉంటారు.
ఈ CWC సమావేశాల్లో ఎ.ఐ.సీ.సీ. కీలక నేతలు పాల్గొని దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రూపొందించనున్నట్లు సమాచారం.
ఇక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన, ఏడాది కాలంలో పాలనపై నివేదికలను అధిష్టానం ముందు ఉంచనున్నారు. కాబట్టి, ఈ సమావేశాల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరగొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.