ఈ రోజు మళ్ళీ పోలీసుస్టేషన్ లో మంచు విష్ణు, వినయ్ పై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. 7 పేజీల సుదీర్ఘ వివరణ రాసి విష్ణు పై మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు లేఖలో తనకు వీరు ఇరువురితో ప్రాణహాని, బెదిరింపులు, ఆర్థిక ఒత్తిడులు వున్నాయని, తనకి జరిగిన అన్యాయాన్ని కూడా అందులో రాశారని సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది.