-నేడు|TODAY SEPTEMBER 14|సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం|NATIONAL HINDI DIWAS సందర్భంగా..
భారతీయులందరినీ ఏకం చేసేది ఐక్యత పెంచేది జాతీయ భాష హిందీ. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష “మండలిస్” తర్వాతి స్థానం హిందీదే. మనదేశంలో హిందీ భాషది మొదటి స్థానమే. దేశంలో ఎక్కువ రాష్ట్రాలలో ప్రజలు మాట్లాడే భాష కూడా హిందీయే. హిందీ జాతీయ భాషగా, అధికారిక భాషగా గుర్తించబడింది. హిందీ జాతీయ అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. ప్రపంచ దేశాలలో 180 విశ్వవిద్యాలయాలలో హిందీ భాష పై అధ్యయనం పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఉండటంతో ప్రస్తుతం యువత ఆ భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 14న జాతీయ హిందీ భాషా దినోత్సవం జరుపుతున్నారు.
ప్రపంచంలో మొదటి 16 భాషల్లో హిందీది 8వ స్థానం. సాహిత్యంలో తృతీయ స్థానం. హిందీని నేర్పించేందుకు అమెరికాలో 114. రష్యాలో ఏడు కేంద్రాలు ఉన్నాయి, మన దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో అధికారిక భాషగా ఉంది.
1949 సెప్టెంబర్ 14ని జాతీయ హిందీ దినోత్సవంగా రాజ్యాంగ పరిషత్ ప్రకటించింది. 1950 జనవరి 26 నుండి హిందీ అధికారిక భాషగా చెలామణి అవుతోంది. దేశవ్యాప్తంగా నెల రోజులపాటు భాషా దినోత్సవం, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తారు. పాఠశాలల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాషాభిమానులు హిందీ భాషా ప్రాముఖ్యతను వివరిస్తుంటారు. ప్రసార మాధ్యమాలలో హిందీకి సుస్థిర స్థానం ఉంది . యునెస్కో ప్రకారం అత్యధికులు అర్థం చేసుకునే భాషగా హిందీ ప్రథమ స్థానంలో ఉంది.
దేశంలో సంస్కృత భాష సహకారంతో హిందీలో 8 లక్షల శబ్దాలను కొత్తగా ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో, జనరల్ స్టడీస్ లో వచ్చే ప్రశ్నలు ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషలో కూడా ఉంటాయి, ఇంగ్లీషులో అవగాహన లోపం ఏర్పడితే హిందీని బట్టి అర్థం చేసుకునే వీలు ఈ భాష తెలిసిన వారికి ఉంటుంది. హిందీ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా బోధన రంగంలోనే కాకుండా ఇతర వృత్తిపరమైన రంగాల్లో ఉపాధి పొందవచ్చు. భారత్ సంచార్ నిగం, జాతీయ బ్యాంకులు, న్యాయస్థానాలు, బీమా, చట్టసభల్లో అనువాదకులుగా జర్నలిజం వంటి రంగాల్లో ఉద్యోగాలకు హిందీ భాషా పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
-లెనిన్ గూడూరు జర్నలిస్టు 9848491179
….
హిందీ పండిట్ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి
హిందీ భాష ప్రాముఖ్యతను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక సిలబస్‌లు అమలు చేస్తున్నాయి. అయితే తెలంగాణలో హిందీ పండిట్ కళాశాలలకు అనుమతులు రద్దు కావడం, సెట్ పరీక్షలు నిలిపివేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం హిందీ భాష అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
-నూర్జహాన్ జి, హిందీ పండిట్ కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్, పిజిటి ఖమ్మం.
….
దేశాన్ని ఏకం చేసే హిందీ భాష
హిందీ భాష దేశ ప్రజలను ఐక్యంగా నడిపించే శక్తి కలిగిన భాష. స్వాతంత్ర్య ఉద్యమంలో హిందీ భాష ప్రధాన పాత్ర పోషించింది. ఈరోజు మీడియా, బ్యాంకులు, సినిమాలు వంటి రంగాల్లో హిందీకి డిమాండ్ పెరిగింది. హిందీ దినోత్సవ శుభాకాంక్షలు
-మహమ్మద్ హమీద్, హిందీ పండిట్
….
జాతీయోద్యమంలో వెలుగునిచ్చింది హిందీ భాష
హిందీ భాష గాంధీజీ స్ఫూర్తితో దేశాన్ని ఏకం చేసింది. 1949లో అధికార భాషగా గుర్తింపు పొందిన హిందీ ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. హిందీ భాషలో ఉద్యోగ అవకాశాలు విస్తరించాయని, అందరికీ హిందీ దినోత్సవం శుభాకాంక్షలు.
-ఎండి. మోహరున్నిసా బేగం, హిందీ పండిట్.
….
హిందీ భాష చాలా సులభమైనది సరళమైనది
హిందీ భాష చాలా సులభమైనది సరళమైనది
హిందీ భాష దేశ ప్రజల గుండెచప్పుడు. హిందీ కి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే హిందీ భాష పై పట్టు సాధించాలి.
-ఎండీ యాకూబీ, జూనియర్ అసిస్టెంట్, పూర్వ హిందీ పండిట్
….
హిందీ భాష అంటే ఇష్టం
హిందీ భాష పై ఇష్టంతో హెచ్ పి టి పూర్తి చేశాను. అనంతరం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాను. హిందీ భాష ప్రచార ప్రసారాలలో ముందుండి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాను.
-పి. రామ్మోహనాచారి, హిందీ పండిట్.
….
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు హిందీ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ భాష తప్పనిసరి. ఎస్‌బిఐ, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ వంటి కార్యాలయాల్లో హిందీ ప్రోత్సాహానికి అధికారులు కృషి చేస్తున్నారు. బ్యాంక్ కార్యాలయ బోర్డులపై రోజుకు ఒక పదం రాసి సిబ్బందికి, వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
-జీవంజి దామోదర్, హిందీ పండిట్.
….
విద్యార్థుల్లో హిందీపై ఆసక్తి పెంచుతున్న
విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తి పెంచేందుకు పాటలు, ఆటలు, చిత్రలేఖనం ద్వారా సులభంగా నేర్పిస్తున్నాను. హిందీ దినోత్సవం సందర్భంగా పిల్లలతో ఎగ్జిబిషన్ నిర్వహించి, నమూనాలు ప్రదర్శింపజేస్తూ భాషపై ప్రేమ కలిగేలా ప్రోత్సహిస్తున్నాను.
-శారద, హిందీ ఉపాధ్యాయురాలు.