CPI|సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ CADRE|కార్యకర్తలకు పిలుపు
గ్రామ, మండల జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్లో శనివారం సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలు సింగోటం సిపిఐ మాజీ సర్పంచ్ ఇందిరమ్మ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయడానికి సిపిఐ శ్రేణులు ప్రజా సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని వాటిని సరి చేయకపోతే సిపిఐ పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గ లో త్వరలోనే అన్ని మండల కేంద్రాలలో సిపిఐ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఒకవైపు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, సమస్యలకు పరిష్కారాన్ని కూడా సూచిస్తారని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులకు కితాబులు ఇస్తుంటే దానికి భిన్నంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగు తున్నదని ఆయన మండిపడ్డారు. కమ్యూనిస్టులు
ఎన్నికలప్పుడు మాత్రమే అవసరం, తర్వాత అవసరం లేదనే విధంగా మంత్రివర్యులు ప్రవర్తిస్తున్న తీరు సరైనది కాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందాలని లేకపోతే దశలవారీగా ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాటం చేయడానికి వెనకడుగు వేసేది లేదని ఉద్ఘాటించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ, విజయుడు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణాజి, మర్యాద వెంకటయ్య, శంకర్ గౌడ్, బిజ్జా శ్రీను, బండి లక్ష్మీపతి, శివశంకర్, రవీందర్, తుమ్మల శివుడు, మల్లేష్, పరశురాములు, గడ్డం శ్రీను, గోపాల్, మధు గౌడ్, నరేష్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.