Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

పాఠాలు, గుణపాఠాలు నేర్పిన PLANE ACCIDENT|విమాన ప్రమాదం!|EDITORIAL

AHMEDABAD| అహ్మదాబాద్‌ AEROPLANE| విమాన దుర్ఘటన నుంచి మనం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపమో, మానవ తప్పిదమో కానీ, మారణహోమం జరిగిపోయింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ విమానాన్ని ఎక్కిన వారు గమ్యాన్ని ముద్దాడక ముందే మృత్యువుని ముద్దాడారు. ఎంతో నమ్మకమైన, భద్రంగా పేరున్న AIR INDIA| ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా ఎయిర్ లోకి వెళ్ళక ముందే కుప్పకూలిపోయింది. విమానాన్ని గమ్యానికి చేర్చే ట్యాంక్ నిండా ఉన్న ఫ్యూయల్ అందులోని వాళ్ళని మంటల్లో మాడ్చి మసి చేసింది. ఒకేసారి వెయ్యి డిగ్రీల వేడిని రగిల్చిన ఆ మంటలకు అందులోని ప్రయాణీకులు, సిబ్బంది, పైలట్ సహా అంతా కాలిబూడిదైపోయారు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడైయ్యాడు. తనను తానే నమ్మలేని విధంగా బతికి బట్టకట్టాడు.

గగన ప్రయాణం గరళ ప్రయాణంగా మారిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం పౌర విమాణ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. విమానం ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలకొరిగింది. మంటల్లో మాడిపోయింది. యంత్రాలు పని చేయలేదో? మరెదో? కానీ, పైలట్ ఇచ్చిన సమాచారానికి, సమాధానం కూడా వినలేని దీన స్థితిలో అది కూలిపోయింది. బహుషా జనావాసాల్లో కూలిపోకుండా పైలట్ తీసుకున్న జాగ్రత్త వల్లనో ఏమో పక్కకు తప్పించబోయినా, అది పైలట్ చేతిలో లేకుండా పోయి, మెడికల్ కాలేజీ భవనంలోకి దూసుకుపోయింది. దీంతో డాక్టర్లు, మెడికోలు ఈ ప్రమాదంలో మరణించారు. జానవాసాల్లోని కొందరు మృత్యువాతపడ్డారు. మొత్తానికి ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. విమానంలోని 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది మొత్తం 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు బతికారు. విమానం కూలిన వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం ధ్వంసమై 33 మంది వరకూ మృతి చెందడటంతో మృతుల సంఖ్య 274కు చేరింది.

2009లో 787-8 డ్రీమ్‌ లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే కావడం విశేషం. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని చెప్పారట. ఆ సమస్యే ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కావచ్చని అన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని కూడా తన వాంగూల్మంలో పేర్కొన్నారు. ఇప్పుడు సలోహ్‌పోర్ అనుమానమే నిజమైందా?

ఇక విమానం కూలిన ప్రదేశంలో దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాద కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్, సిస్టమ్ డాటాను విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విమానం కూలిపోయే సమయంలో పరిస్థితిని ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలెట్ మాట్లాడిన మాటలు అర్థం చేస్తున్నాయి. ‘విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..’ అని పైలెట్ సుమత్ చెప్పారు. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్‌లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అంటే నెట్టడం అనే అర్థం కూడా ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ల వైఫల్యం కారణమని భావించవచ్చా? ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది.

ఈ ఘటన మనకు ప్రధానంగా విమాన యానంలోని సాంకేతికత నైపుణ్యాలని మరింత సాధించాలన్న సత్యాన్ని చాటింది. సాధారణంగా విమనాలు బయలుదేరే ముందు దాని సామర్థ్యం, యంత్రాల పనితీరు, సాంకేతికతలు, లోపాలను పరిశీలించిన తరవాతనే ప్రయాణానికి సంసిద్ధమవుతారు. అలా జరిగిందా? లేదా? అలాగే ఆ ఎయిరిండియా విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళుతున్నది. అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చిన విమానం ఒక్కసారిగా ఎందుకలా అయ్యింది? మరే కోణమైనా ఉందా? అన్నవి తేలాల్సిన అంశాలు. 146 కోట్లు ఉన్న దేశ జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికీ విమానయానం లేదు, విమానాలు లేవు, విమానాశ్రయాలు లేవన్న విమర్శలను ఒకసారి ఆలోచించుకోవాలి. తాజా ఘటనపై సునిశిత పరిశోధన జరగాలి.

నిజానికి అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన ఒళ్ళు జలదరింప చేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను పిండేస్తున్నది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎందరో కలలను చిదిమేసింది. తప్పెవరిదైనా వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కొన్ని బతుకులు ఛిద్రం అయ్యాయి. విమనాల ఉత్పత్తి మొదలు సాంకేతికత వరకు సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడాలి. దేశీయ విమానయాన సంస్థల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకూ ఈ ప్రమాదానికి దోహదం చేసిన అన్ని అంశాలను గుర్తించి, అవసరమైన చర్యలను చేపట్టాలి.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News