Trending News
Thursday, October 2, 2025
22.8 C
Hyderabad
Trending News

ప్రభుత్వ భూములు పాలకుల ఆస్తులా!?

ప్రజల ఆస్తులకు కేర్ టేకర్ గా ఉండాల్సిన ప్రభుత్వాలు, ఆ ఆస్తులనే తెగనమ్ముతుండటాన్ని మించిన తెగబాటు ఇంకేముంటుంది? ప్రజా ప్రయోజనాల పేరుతో, ఉద్యోగ, ఉపాధి కల్పన సాకుతో, విదేశీ, స్థానిక ప్రైవేటు సంస్థలకు, పరిశ్రమలకు, అతి చౌకగా, అప్పనంగా భూములు అప్పగిస్తుండటం అత్యంత దారుణం. దుర్మార్గం. ఆతర్వాత అవే కంపెనీలు ఆయా భూములను వ్యాపారం చేసి, కోట్లు గడిస్తున్నాయి. తర్వాత కాలంలో ప్రభుత్వాలు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములు కొన్ని సంస్థలు, మరికొన్ని పరిశ్రమలు, ప్రైవేట్ వ్యక్తుల వశం అవుతున్నాయి. ఇక ప్రభుత్వ పరిశ్రమలు, కార్యాలయాలు, సంస్థల కోసం భూములే లేక సేకరించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. మరుగుదొడ్లకు, స్మశానవాటికలకు కూడా భూములు లేని దౌర్భాగ్యం దాపురిస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌ కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదం ఈ కోవలోనిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ భూమిని ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించారు. దానిని ప్రస్తుత ప్రభుత్వం కోర్టు ద్వారా తిరిగి స్వాధీనం చేసుకున్నది. అదే భూమిని తిరిగి అమ్మకానికి సిద్ధపడింది. సుప్రీం కోర్టు జోక్యంతో సమస్య తీవ్రత తెలిసి వచ్చింది. పాలకులు తమ అవసరాలు లేదా ఉచిత పథకాలకు నిధుల సమీకరణ కోసం ఇష్టారీతిన భూములను అమ్ముతున్నారు. ‘‘మా రాష్ట్రానికి రండి. పెట్టుబడులు పెట్టండి. భూములు ఇస్తాం. విద్యుత్‌ ఇస్తాం. నీరు ఇస్తాం’’ అంటూ బీకారీ, బేహారుల్లా ప్రపంచాలు తిరుగుతున్నారు.

విశాఖలో గత వైసీపీ ప్రభుత్వ వైఖరినే తాజాగా టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇప్పటికే రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల్లో కమర్షియల్‌ కార్యకలాపాల కారణంగా 15ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా టీసీఎస్‌కు కారుచౌకకు భూములు ఇవ్వడం వివాదంగా మారింది. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలోని రుషికొండ ప్రాంతంలో ఎకరానికి కేవలం 99 పైసల చొప్పున టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కు 21.16 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించడం దారుణం. రుషికొండలో రాష్ట్ర రిజిష్ట్రేషన్ల శాఖ రేట్ల ప్రకారం ఒక చదరపు గజం రూ.30 వేలు ప్రాతిపదికగా తీసుకున్నా, ఒక ఎకరం రూ.15 కోట్ల విలువ చేస్తుంది. అంటే, టీసీఎస్‌కు ఇచ్చిన 21.16 ఎకరాల భూమి విలువ రూ.320 కోట్లకు మించి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జిఓఎంఎస్‌ నెం.571 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వకూడదు. 2జి స్పెక్టమ్ర్‌ కేసులో, ఇతర కేసుల్లో ప్రభుత్వ భూముల వంటి ప్రకృతి వనరుల విషయంలో ప్రభుత్వం ప్రజల ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని, ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ సంస్థలకు మార్కెట్‌ ధర కన్నా తక్కువకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే! ఆవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలనేగాక సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా టీడీపీ కూటమి సర్కారు ఉల్లంఘించినట్లే. ఒక్క 2024 ఏడాదిలో టీసీఎస్‌ రూ.62,165 కోట్ల లాభం గడించగా, అటువంటి కంపెనీకి 99 పైసల లీజుకు విలువైన ప్రభుత్వ భూమిని ముట్టజెప్పడం హాస్యాస్పదం. ఆక్షేపణీయం.

ఆ ప్రాంతంలో టీసీఎస్‌ ఒక ఐటి పరిశ్రమను పెట్టి 12 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ, గతంలో చాలా కంపెనీల యాజమాన్యాలు భూములు కోట్టేశాయే తప్ప ఉద్యోగాలు కల్పించలేదు. పైగా వాటిని బ్యాంకుల్లో కుదువబెట్టి భారీగా రుణాలు తీసుకుని, ఆ తరవాత వాటినీ ఎగ్గొట్టిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అనంతపురం లేపాక్షి మొదలు ఒంగోలు వాన్‌పిక్‌ శ్రీకాకుళం జిల్లా థర్మల్‌ కేంద్రాల వరకూ వేల ఎకరాల భూములు కార్పొరేట్‌ కంపెనీల కబంధ హస్తాల్లో చిక్కుకున్న విషయం చంద్రబాబుకు తెలియందికాదు. డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇలాంటి పందేరాలు చూస్తూ ఉండడం సరికాదు.

వందలు, వేల ఎకరాలను సంపన్నులకు కట్టబెట్టే ప్రభుత్వ పెద్దలు ఒక్క సెంటు- భూమిని కూడా పేదలకు ఇవ్వడంలేదు. ప్రభుత్వ భూములను అధికారంలో వున్నవారు తమ అనుయాయులకు కట్టబెట్టే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం గత నాలుగు దశాబ్దాలుగా అమలవుతోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్‌ హయాంలో ఇలాంటి పందేరాలు విచ్చలవిడిగా సాగాయి. ఇప్పుడు చంద్రబాబు మరోమారు అదే గారడీని ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2006 నుండి 2011 మధ్య 88,492 ఎకరాల భూమిని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 1,027 వివిధ స్వదేశీ, విదేశీ కంపెనీలకు కట్టబెట్టింది. తద్వారా రాష్ట్ర ఖజానా అక్షరాలా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని కాగ్‌ తేల్చింది. ప్రస్తుతం ఓడరేవులు మొదలు విమానాశ్రయాలను సైతం అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తూనే ఉన్నాం. గంగవరం పోర్టు కోసం పోరాటం చేసి, భూములు అప్పగించిన వారు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. కానీ ఆ భూములను, పోర్టును ఆదానీ ఎగురేసుకు పోయారు.

ప్రైవేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు అప్పగించడం, అనుచితమైన రాయితీలివ్వడం, చట్టాలను సడలించే విధానాలతో వచ్చే పెట్టుబడులు రాష్ర్టానికిగానీ, ప్రజలకుగానీ ప్రయోజనాలు కలిగించిన దాఖలాలు లేవు. ప్రపంచ ఐటీ రంగానికి టీసీఎస్‌ అతీతమేమీ కాదు. అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటుంటే టీసీఎస్ మాత్రం విశాఖలో కొత్తగా 12 వేల ఉద్యోగాలను ఎలా కల్పిస్తుంది? ప్రభుత్వం ఎలా నమ్ముతుంది? ప్రజల్ని ఎలా నమ్మిస్తుంది? ప్రభుత్వ భూములు పాలకుల సొంత ఆస్తి కాదు. మీ భూములనైతే ఇలాగే పంచేస్తారా? అంతా ఆలోచించాలి.

తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ కూడా ఫార్మాసిటీ పేరుతో ఇలాగే వ్యవహరిస్తోంది. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఇదే పెడధోరణిని విశ్రుంఖలంగా సాగించింది. ఇప్పుడేమో భూముల పందేరంపై నంగనాచిలా కొట్లాటకు దిగుతోంది. భూములను కట్టబెట్టడంలో అంతా ఆ తాను ముక్కలే! అన్నది ప్రజలు గ్రహించాలి.

Latest News

శుక్రవారం అక్టోబర్ 03 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి పగలు 02.28 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శ్రవణ ఉదయం 06.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ధృతి రాత్రి 06.46 వరకు ఉపరి శూల కరణం భద్ర సాయంత్రం...

ఓ మహాత్మా..|POETRY

నిన్న,నేడు,రేపు రోజు ఏదైనా వాదం ఒక్కటే 'గాంధేయవాదం' ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం 'మహాత్మాగాంధీ' శాంతికి బ్రాండ్ అంబాసిడర్ నాయకత్వానికి నిదర్శనం ఉద్యమానికి ఊపిరి మొత్తానికి భారతదేశ 'మనిమకుటం' ఒక్కమాటతో జనాలకు జవసత్వాలు నింపి స్వతంత్ర భావజాలాన్ని పంచి అలుపెరుగని...

విజయదశమి అంటే ఏంటి? దసరాను ఎలా ఆచరించాలి?|ESSAY|ARTICLES

కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం...

గీ బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సావరట!?|ADUGU TRENDS

మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.....

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం...

గురువారం అక్టోబర్ 02 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం విజయదశమి దసరాపండుగ గాంధీ జయంతి తిధి దశమి పగలు 02.38 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.03 వరకు ఉపరి శ్రవణ యోగం సుకర్మ రాత్రి 08.03 వరకు ఉపరి ధృతి కరణం...

డైబర్ లేని ఆటోలొత్తానయి!?|ADUGU TRENDS

ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం?...

ఆదివాసీల అస్తిత్వ పోరాటం!|EDITORIAL

“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన...

బుధవారం అక్టోబర్ 01–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం--శుక్లపక్షం మహర్నవమి తిధి నవమి పగలు 02.19 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా యోగం అతిగండ రాత్రి 08.56 వరకు సుకర్మ కరణం కౌలవ సాయంత్రం 04.18 వరకు గరజి వర్జ్యం పగలు 01.24...

క్రికెట్ ను ఆటగానే చూడాలి!|EDITORIAL

‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా...

ఆ స్నేహితులను చూసి స్నేహమే సలాం చేసింది!|FRIENDSHIP

పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ...

యెహె తియ్! గీ ఆటకు వానడ్డమా?|ADUGU TRENDS

యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News