Online|ఆన్‌లైన్ Payment|పేమెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, Paytm|పేటీఎం లాంటి యూపీఐ యాప్‌లు వాడుతున్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఆగస్ట్ 1 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకొచ్చిన ఈ మార్పులు UPI సేవల నాణ్యతను మెరుగుపరచడం, సర్వర్లు మేలుగా పనిచేయేలా చూసుకోవడం, లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలుగా చెప్పవచ్చు. కొత్త మార్పులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సహా అన్ని యూపీఐ యాప్‌లపై వర్తిస్తాయి.
ఈ మార్పుల ప్రకారం ఇకపై ఒక యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఇంతకుముందు ఇలా ఎలాంటి పరిమితి ఉండేది కాదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఉండే పీక్ అవర్స్‌లో బ్యాలెన్స్ చెక్ అభ్యర్థనలపై మరింత పరిమితులు అమలయ్యే అవకాశం ఉంది. ఇకపై లావాదేవీ పూర్తయ్యాక డబ్బులు వచ్చినా, వెళ్లినా బ్యాలెన్స్ ఆటోమెటిక్‌గా చూపించబడుతుంది.
latest-telugu-news
ఇక ఒక్క యూపీఐ యాప్‌లో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఇది సిస్టమ్‌పై అనవసరమైన ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం.
ఆటోపే వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో EMIలు, OTT సబ్‌స్క్రిప్షన్లకు సంబంధించిన ఆటోపే లావాదేవీలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఈ ఆటోపేలు జరగవచ్చు. ఒక్కో మ్యాండేట్‌కు గరిష్టంగా నాలుగు ప్రయత్నాలు మాత్రమే అనుమతించబడతాయి – ఒకటి ప్రారంభ ప్రయత్నం, మిగిలిన మూడు రీట్రైలు.
పెండింగ్‌లో ఉన్న పేమెంట్ల స్టేటస్ చెక్ చేసే విషయానికొస్తే, రోజుకు గరిష్టంగా మూడు సార్లు మాత్రమే వాటిని చెక్ చేయొచ్చు. అలాగే ఒక్కో చెక్ చేయడానికి మధ్య కచ్చితంగా 90 సెకన్ల విరామం ఉండాలి.
phone-pay | google-pay | online-transactions |
దీంతోపాటు, 12 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలంగా వాడని మొబైల్ నంబర్లతో లింక్ అయిన యూపీఐ IDలను ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేయనున్నట్లు NPCI ప్రకటించింది. అంటే ఏడాది పాటు వాడనిది ఉంటే యాప్ పనిచేయకపోవచ్చు.
UPI Transactions | new-rules |
ఈ మార్పులు సాధారణ యూజర్లకు పెద్దగా ఇబ్బందులు కలిగించవు. డబ్బులు పంపించటం, రిసీవ్ చేయడం వంటి ప్రధాన పనితీరులో ఎలాంటి మార్పులుండవు. కానీ ఇవి యూపీఐ వ్యవస్థను మరింత వేగంగా, భద్రతగా, నెమ్మదిగా పనిచేసేలా చేయడానికే తీసుకున్న నిర్ణయాలు కావడం గమనించాలి. కనుక రెగ్యులర్ యూజర్లు తమ యాప్‌లను వీటి ప్రకారం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
upi-payments | upi-transaction-limits |