Trending News
Thursday, July 31, 2025
26.3 C
Hyderabad
Trending News

KCR|కేసీఆర్ ‘గూడు’ పుఠాణి !?

అధికార దాహం ! ఆధిపత్య పోరాటం !!
KCR|కేసీఆర్ అసమర్థతా?
KTR|కేటీఆర్ ఆధిపత్యమా?
పార్టీపై పెత్తనమా?
పంపకాల పేచీనా?
KAVITA KALVAKUNTLA|కవిత ఆరోపణల్లో ఔచిత్యమేమిటి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌|ANDHRA PRADESH లో కూడా తెలంగాణ|TELANGANA ఎప్పుడూ ఇంతగా దోపిడీకి గురికాలేదు. ఉమ్మడి ఏపీని పాలించిన నేతలు కూడా ఎప్పుడూ ఇంతగా తెలంగాణను దగా చేయలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి కూడా మిగులు బడ్జెటే తప్ప అప్పుల కుప్ప కాలేదు. ఎప్పుడూ పదేళ్ళపాటు ఒక్క కుటుంబం గుప్పిట్లోనే అధికారం ఉండిపోలేదు. ప్రజల ప్రాణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దగాపడ్డది. దోపిడీకి గురైంది. ఇది ముమ్మాటికీ గణాంకాలు చెబుతున్న నిజం. కళ్ళ ముందే కనిపిస్తున్న సత్యం. ‘అప్పులు తెచ్చాం ఆస్తులు పెంచాం’ అంటున్న వాళ్ళ ఆస్తులు పెరిగి, అప్పులు ఎందుకు తగ్గాయి? కుటుంబానికి ఒక నీతి, ప్రభుత్వానికి ఒక నీతి ఉంటుందా? కుటుంబానికి కంటే కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి కదా? విచిత్రమేంటంటే, ఇదంతా ఒక్క కల్వకుంట్ల కుటుంబం వల్లే జరిగిందని ఢంకా బజాయిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ…రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, మరి కేసీఆర్ కుటుంబ అవినీతిని వెలికి తీసే పనికి నేటికీ ఎందుకు పూనుకోలేదు? కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని, దాచుకున్నదనే ఆ రెండు పార్టీలు ఆ ఆరోపణలను రుజువు చేసే పనికి ఏనాడూ ఎందుకు ఉపక్రమించలేదు. అంటే వాళ్ళంతా ఒక్కటే. ఆ బీఆర్ఎసే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఆ తాను ముక్కలే? పరస్పరం దూషించు కుంటాయే తప్ప దోషిత్వాన్ని నిరూపించవు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవు.

ఉద్యమకారులు, ప్రజాదరణతో నిలిచిన బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగానే మిగిలిందన్నది అంగీకరించి తీరాల్సిందే. ఆ పార్టీకి కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలే మూడు మూల స్తంభాలు. HARISH RAO|హరీశ్ రావు, SANTOSH KUMAR|సంతోశ్ రావులు సపోర్ట్ పిల్లర్లు.

కేసీఆర్ కుటుంబ అంతర్గత తాజా ఎపిసోడ్‌ కేవలం రాజకుటుంబాల్లో జరిగే అధికారం, ఆధిపత్యం, పంపకాల పోరాటం లాంటిదే. ఈ కుట్రలు, కుతంత్రాల తెగబాటు కూడా అందులో భాగమేనని భావించాల్సి వస్తున్నది. అధికారం లేకపోతే ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి కేసీఆర్ కుటుంబం చేరిందని, అందుకోసం ఎంతకైనా తెగిస్తారనే అభిప్రాయం తాజా పరిణామాలను బట్టి బలపడుతోంది.

అధికార దాహం ! ఆధిపత్య పోరాటం !!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ ఎప్పుడూ ఇంతగా దోపిడీకి గురికాలేదు. ఉమ్మడి ఏపీని పాలించిన నేతలు కూడా ఎప్పుడూ ఇంతగా తెలంగాణను దగా చేయలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి కూడా మిగులు బడ్జెటే తప్ప అప్పుల కుప్ప కాలేదు. ఎప్పుడూ పదేళ్ళపాటు ఒక్క కుటుంబం గుప్పిట్లోనే అధికారం ఉండిపోలేదు. ప్రజల ప్రాణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దగాపడ్డది. దోపిడీకి గురైంది. ఇది ముమ్మాటికీ గణాంకాలు చెబుతున్న నిజం. కళ్ళ ముందే కనిపిస్తున్న సత్యం. విచిత్రమేంటంటే, ఇదంతా ఒక్క కల్వకుంట్ల కుటుంబం వల్లే జరిగిందని ఢంకా బజాయిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ… ఆరోపిస్తున్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, కేసీఆర్ కుటుంబ అవినీతిని వెలికి తీసే పనికి నేటికీ పూనుకోలేదు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని, దాచుకున్నదనే ఆ రెండు పార్టీలు ఆ ఆరోపణలను రుజువు చేసే పనికి ఏనాడూ ఉపక్రమించలేదు. ఆ బీఆర్ఎసే కాదు, బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఆ తాను ముక్కలే?

కాళేశ్వరం ప్రాజెక్టు నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌కు ఎటిఎం లాగా మారిందని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పదేపదే ఆరోపించిన వారు, ఏ చర్యా తీసుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా అప్పుల లెక్కలు చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏ చర్యా చేపట్టలేదు. అంటే రాజకీయ పార్టీలన్నీ ఒక్కటే. పరస్పరం దూషించు కుంటాయే తప్ప దోషిత్వాన్ని నిరూపించవు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవు.

కేసీఆర్‌ కుటుంబం ఉద్యమకారులకు, త్యాగాలు చేసిన కుటుంబాలకు ద్రోహం చేసిందని ఉద్యమకారులే పదే పదే అంటున్నారు. అప్పులు చేసి ప్రజలను కూడా దగా చేసిందని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తున్నది. మరి ఇంతగా తెలంగాణను దగా చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఆపార్టీలో కూడా కాదు కేవలం ఆ కుటుంబంలోనే అధికారం, ఆధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరాటమే తప్ప మరేమీ కాదని, కవిత తిరుగుబాటు తర్వాత పరిణామాలను బట్టి ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే ఇదంతా తమకు సంబంధం లేని అంశంగా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇక ఎదుటి పార్టీల్లో చిచ్చుపెట్టి, విలీనం చేసుకోగలిగిన కేసీఆర్, సొంత ఇల్లునే చక్కబెట్టుకోలేని స్థితిలో ఉన్నారా? ఆయన అంతగా అసమర్థ నేతా? ఉద్యమ సమయంలోనే చీటికి మాటికి అలిగి ఇల్లు కదలని కేసీఆర్, సీఎం అయ్యాక సెక్రటేరియట్ కు కూడా రాకుండా, ప్రగతి భవన్ నుంచి పాలన చేశారు. పదవి పోయాక ఇప్పుడు ఎర్రవెల్లి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ఇదంతా కేటీఆర్ వల్లే జరుగుతుందా? బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కేటీఆర్ తమ గుప్పిట్లోకి తీసుకున్నారా? ఆ కారణంగానే కవిత తిరుగుబాటు చేశారా? పార్టీ పెత్తనమా? లేక పంపకాల పేచీనా? ఉమ్మడి ఆస్తుల విషయంలోనే పంచాయితీ ఉన్నట్లుగా కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారం కోల్పోయాక అసెంబ్లీకి రాకుండా, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకుండా కేసీఆర్‌ చేసిన తప్పిదాల వల్లే, పార్టీపై పట్టు కోల్పోయారా? కేటీఆర్‌ ఆధిపత్యాన్ని చెల్లి కవిత సహించలేకపోతున్నారా? అంటే, కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసీలు ఇస్తే ఎక్స్ లో పోస్టుతో సరిపెట్టి, కేటీఆర్ కు సిబిఐ నోటీసులు ఇస్తే పార్టీ మొత్తం స్పందించడాన్ని కవిత ప్రశ్నించడాన్ని బట్టి ఇదే అర్థమవుతున్నది.

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర తాను జైలుకు వెళ్ళిన నాటి నుండే జరుగుతోందని కవిత వెల్లడించారు. అంతకుముందే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైలెంట్‌ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటే చేయలేదు. కేసీఆర్ కుటుంబం తప్పిదాల, మోసాల, దోపిడీల చిట్టా బీజేపీ వద్ద ఉందని, ఆ కేసుల భయంతోనే ఇదంతా చేస్తున్నారని, ప్రజలు చర్చిస్తున్నారు. లిక్కర్‌ కేసులో అడ్డంగా బుక్కయిన కవిత కోసం కూడా బీఆర్ఎస్, బీజేపీ ముందు మోకరిల్లిందనేది కాదనలేని నిజం.

తమ కులం వారికే పదవులు ఇవ్వటం, తెలంగాణతో, ఉద్యమంతో సంబంధం లేని వారికి అధికార అందలాలు ఎక్కించడం, కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఉద్యమకారులను దూరం పెట్టడం వంటి అనుభవంలోకి వచ్చిన నిర్ణయాలన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయి. వివక్ష, ఏకపక్ష, బంధు ప్రీతి, ఆత్మ స్థుతి, పర నిందలకు అలవాటు పడి, ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ అంటే ఏ ‘సామాజిక తెలంగాణ’? ప్రజలు నమ్ముతారా? కవిత ఆలోచించాలి.

జయశంకర్‌ సార్‌ నుంచి కోదండరామ్‌ సార్‌ వరకు అందరూ దగాపడ్డవారే. ఉద్యమకారులు, ప్రజాదరణతో నిలిచిన బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగానే మిగిలిందన్నది అంగీకరించి తీరాల్సిందే. ఆ పార్టీకి కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలే మూడు మూల స్తంభాలు. హరీశ్ రావు, సంతోశ్ రావులు సపోర్ట్ పిల్లర్లు.

తనకు, తన తండ్రి కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని కవిత అంటున్నారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసునని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కూడా కవిత భగ్గుమన్నారు. వెన్నుపోట్లకు అలవాటు పడిన వారు చివరకు కుటుంబ సభ్యులనైనా పొడవడానికి వెరవరని కవిత వ్యాఖ్యలే చెబుతున్నాయి.

కేసీఆర్‌ కుటుంబం అజమాయిషీలో అప్పుల కుప్పైన తెలంగాణ వందేళ్లు వెనక్కి పోయింది. ‘బంగారు తెలంగాణ’ నినాదంగానే మిగిలి, కేసీఆర్‌ కుటుంబం మాత్రం ‘24 క్యారట్ల గోల్డ్’ గా మారిందన్న అభిప్రాయం సర్వత్రా నిలిచిపోయింది. ఈ దశలో కేసీఆర్ కుటుంబ అంతర్గత తాజా ఎపిసోడ్‌ కేవలం రాజకుటుంబాల్లో జరిగే అధికారం, ఆధిపత్యం, పంపకాల పోరాటం లాంటిదే. ఈ కుట్రలు, కుతంత్రాల తెగబాటు కూడా అందులో భాగమేనని భావించాల్సి వస్తున్నది. అధికారం లేకపోతే ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి కేసీఆర్ కుటుంబం చేరిందని, అందుకోసం ఎంతకైనా తెగిస్తారనే అభిప్రాయం తాజా పరిణామాలను బట్టి బలపడుతోంది.

Latest News

అటా? ఇటా? వేటా!?|SUPREME COURT|JUDGEMENT

ముచ్చటగా మూడే దారులు! గతంలో హైకోర్టు తిరస్కరణ! తీర్పేదైనా ప్రభావం తీవ్రమే! రాజకీయాలను ప్రభావితం చేసేదే! ‘కీ’లకం కానున్న అత్యున్నత తీర్పు! ‘సుప్రీం’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలేది నేడే! పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తేంటి? ఉంటారా? ఊడుతారా?...

సోలార్‌ విద్యుత్తుదే భవిష్యత్తు!|EDITORIAL

రోజురోజుకు ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. జల విద్యుత్ ఖరీదైనదిగా మారుతోంది. మరోవైపు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. జనాభా పెరుగుతోంది. డిమాండ్ కనుగుణంగా విద్యుత్ తయారీ ఓ సవాల్ గా మారింది. వీటన్నింటికీ మించి...

గురువారం జూలై 31–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి తెల్ల 03.53 వరకు ఉపరి అష్టమి నక్షత్రం చిత్త రాత్రి 12.34 వరకు ఉపరి స్వాతి యోగ సాధ్య రాత్రి తెల్ల 03.37 వరకు ఉపరి శుభ కరణం...

నిరుద్యోగ Freshers|ఫ్రెషర్లకు Good News|శుభవార్త:

ఈ one year|ఏడాది 20 వేల Jobs|ఉద్యోగాలు ఇవ్వనున్న ఇన్ఫోసిస్|Infosys India|భారతీయ It|ఐటీ రంగంలో ఉద్యోగాల భద్రత, వేతన పెంపుదలపై అనేక అనుమానాలు ఉన్న ఈ తరుణంలో దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ...

Premanand Maharaj|ప్రేమానంద్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు

Womens|మహిళలపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువ ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన మహారాజ్, ఈ రోజుల్లో వర్జిన్ అమ్మాయిలు చాలా...

Credit Card|క్రెడిట్ కార్డుతో చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి?

India|భారతదేశంలో పెరుగుతున్న క్రెడిట్ కార్డులు|Credit Cards పెరుగుతున్న రుణ సంక్షోభం క్రెడిట్ కార్డు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో రుణ డిఫాల్ట్‌లు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్...

Internet|ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే Bitchatmesh|బిట్‌చాట్‌ మెష్ యాప్

Data Protection|డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత|Main Importance Twitter|ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే రూపొందించిన కొత్త కమ్యూనికేషన్ యాప్‌ బిట్‌చాట్ మెష్| BitChat Mesh ఇప్పుడు I Phone Users| ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి...

Russia|రష్యాలో భారీ earthquake|భూకంపం..

Hawai|హవాయి, Japan|జపాన్‌, China|చైనాలకు సునామీ హెచ్చరికలు రాష్ట్రాలన్నీ భయాందోళనతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు రష్యాలోని తూర్పు ప్రాంతం కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో నమోదైన...

బుధవారం జూలై 30–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. శుక్లపక్షం తిధి శు.షష్ఠి రాత్రి 02.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 10.16 వరకు ఉపరి చిత్త యోగ సిద్ద రాత్రి తెల్ల 03.08 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ...

పులులతోనే సకల మానవ జీవ వైవిధ్యం!|EDITORIAL

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, పర్యావరణం ఇవి మానవ మనుగడుకు అత్యావశ్యం. కానీ, వీటినే మానవుడు అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై శ్రద్ధాసక్తులు తగ్గిపోతున్నాయి. మానవుడు పుట్టిన నాటి నుండే...

Jubilee hills|జూబ్లీహిల్స్‌లో గెలిచేది Congress|కాంగ్రెస్సే

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి భారీగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, కాంగ్రెస్...

NAGARJUNA SAGAR|నాగార్జునసాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద|Floods

Nalgonda|నల్గొండ జిల్లా పరిధిలో ప్రధాన జలవనరుల కేంద్రంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయం నిండు కుండలా మారింది. అధికారులు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News