రాజాసింగ్ BJP|బీజేపీకి గుడ్ బై
11 ఏళ్ల రాజకీయPOLITICAL LIFE|ప్రయాణానికి ముగింపు,
హిందూత్వ సేవే లక్ష్యం
TWEET|ట్వీట్ చేసిన MLA|ఎమ్మెల్యే RAJASINGH|రాజాసింగ్
తెలంగాణ రాష్ట్రంలో గోషామహల్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్న దాదాపు 11 ఏళ్ల అనంతరం, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. రాజాసింగ్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ, నాకు పదవి, సత్తా, వ్యక్తిగత స్వార్థం అసలు లేవు. నా జీవితం హిందూత్వానికి అంకితం. దేశ సేవ, ప్రజల సంక్షేమం, హిందూత్వ పరిరక్షణ కోసం 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. పార్టీ నాపై విశ్వాసం ఉంచి వరుసగా మూడు సార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇందుకు బీజేపీ నాయకత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. అయితే, బీజేపీ కార్యకర్తల అసంతృప్తిని పార్టీ కేంద్రమైన ఢిల్లీకి చేరవేయలేకపోయిన బాధను రాజాసింగ్ వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని స్వప్నంతో వేలాది కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. వారి బాధను, అధిష్టానం దాకా తీసుకెళ్లలేకపోయాను. కానీ నా నైతిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. తాను పార్టీ వీడుతున్నా హిందూత్వం కోసం తన పోరాటం మాత్రం ఆగదని రాజాసింగ్ స్పష్టం చేశారు. నా శ్వాస ఉన్నంతవరకు హిందూత్వం, రాష్ట్రీయవాదం, సనాతన ధర్మం కోసం పునరుత్తేజంతో పనిచేస్తాను. హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతు ఎప్పటికీ మిన్నగలుగుతూనే ఉంటుంది. సమాజానికి సేవ చేయడమే నా ధ్యేయం. నా ప్రయాణంలో మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని భావోద్వేగంగా పేర్కొన్నారు. రాజాసింగ్ బీజేపీని వీడినప్పటికీ, ఆయన హిందూత్వ పంథాలో తమదైన రాజకీయ రంగంలో ముందుకు సాగుతారనే సంకేతాలను ఇచ్చారు. ప్రస్తుతం ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. జై శ్రీరామ్ అని ముగిస్తూ, తన భవిష్యత్తు దిశగా హిందూ సమాజానికి అంకితంగా పనిచేయనున్నట్లు ప్రకటించారు.