Trending News
Friday, July 11, 2025
30.7 C
Hyderabad
Trending News

FARM HOUSE|‘వ్యవసాయ క్షేత్రం’ రణ క్షేత్రం కాబోతోందా!?

సంచలనమైన CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డి CHALLENGE|సవాల్!
సీఎం ఛాలెంజ్ కు KCR|కేసీఆర్ FAMILY|ఫ్యామిలీ జవాబేంటి?
రేవంత్ అన్నంత పనీ చేస్తారా?
MINISTERS|మంత్రులను పంపుతారా? లేక తనే వెళతారా?
ఫాం హౌస్ పంచాయతీ పరాకాష్టకు…
ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే ఏంటి?
గులాబీల్లో గుబులు? హస్తంలో ఆందోళన?

కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ‘రామ’ బాణం విసిరితే, సీఎం మాజీ సీఎం కేసీఆర్ పై ‘ఫాం హౌస్’ అస్త్రం వదిలారా? రైతులకు వ్వయ‘సాయం’ విషయమై ప్రజాక్షేత్రంలో పట్టుపట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు, ఇప్పుడు కేసీఆర్ నివాసం ఉంటున్న వ్యవసాయ క్షేత్రాన్ని రణ క్షేత్రంగా మార్చబోతున్నాయా? భూమి పుత్రుల మెప్పు కోసం మాటల యుద్ధానికి దిగిన ఆ రెండు పార్టీలు సై అంటే సై అంటూ సవాళ్ళు విసురుకుంటున్నాయి. ప్రెస్ క్లబ్ కు రావాలని కేటీఆర్ సవాల్ తో కాంగ్రెస్ పై గెలిచామనుకుంటున్న బీఆర్ఎస్ సంబరం, 24 గంటలు గడవక ముందే సైలెంట్ అయింది. తెలివిగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ను కార్నర్ చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ‘మీరు అసెంబ్లీకి రండి.. లేదంటే నేనే మీ ఫాం హౌస్ కి వస్తాను. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ చేద్దాం. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నాను. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటాం. మీ అనుభవం రాష్ట్రానికి ఉపయోగడాలి. అదీ కాదంటే మా మంత్రులను పంపిస్తా.. అదీ కుదరదంటే నేనే వస్తా…’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. సాధారణంగా అధికార పార్టీలు అసెంబ్లీ, చర్చకు భయపడతాయి. అందువల్ల అసెంబ్లీ పెట్టాలని, చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడమే ఇప్పటిదాకా చూశాం. అసెంబ్లీకి రా రమ్మని ప్రతిపక్ష నేతను ప్రభుత్వమే పిలవడం, ప్రతిపక్షం అందుకు భిన్నంగా కనిపించడం చాలా అరుదేగాక, ఆశ్చర్యం కూడా! అప్పుడెప్పుడో మల్కాజీగిరి ఎంపీగా కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్ కెమెరాలు ఎగిరించిన కేసులో బాధితుడైన సీఎం రేవంత్ అన్నంత పనీ చేస్తారా? కేసీఆర్ ఫాం హౌస్ కు మంత్రులను పంపిస్తారా? లేక తానే వెళతారా? సీఎం సవాల్ కు కేసీఆర్ ఫ్యామిలీ సమాధానమేంటి? సీఎంను గోల్ గోల్ చేద్దామని బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ లో పడిందా? పొరపాటున కేటీఆర్ తొందరపడ్డారా? నిజంగా ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే ఏంటి? గులాబీల్లో శ్రేణుల్లో గుబులు, హస్తంలో ఆందోళన, రాజకీయాల్లో ఉత్కంఠ మొదలైంది. ఏం జరగనుంది?

హైదరాబాద్‌, జూలై 10 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సవాళ్ళు… ప్రతి సవాళ్ళు రాజకీయాల్లో షరా మామూలే! పరస్పరం సవాళ్ళు విసురుకోవడం తెలిసిందే. పొలిటికల్ మైలేజీ కోసమో, వ్యక్తిగత, పార్టీ పరమైన ప్రతిష్టల కోసమో, కేడర్ ను కాపాడుకోవడం కోసమో, నిత్యం వార్తల్లో ఉండటం కోసమో ఇలా చేయడం మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ పార్టీలకు చాలా సందర్భాల్లో ప్రజల కంటే కూడా పరిస్థితుల పట్లే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏ అవకాశాన్ని ఏవిధంగానైనా తమకు అనుకూలంగా మార్చుకోవడం పైనే వాటి ద్రుష్టి ఉంటుంది. రాజకీయాల్లో ఇవేవీ కొత్త కాకపోయినా, తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితిలో కొంత తీవ్రత ఎక్కువ కనిపిస్తోంది.

రైతులకు మీ కంటే మేమే ఎక్కువ చేశామన్న అంశంపై సవాల్, ప్రతి సవాళ్ళు మొదలయ్యాయి. జూలై 4న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి‘రాష్ట్రంలో రైతు రాజ్యం రావడానికి మేమే కారణమని, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికగా ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని, ఈ చర్చకు మోడీ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆరే వస్తారో రావాల’ని సవాల్ విసిరారు. దీంతో కేటీఆర్ కల్పించుకుని కేసీఆర్ దాకా ఎందుకు నేనే వస్తానని, కొండారెడ్డిపల్లె, కొడంగల్, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. 72 గంటల్లోగా సీఎం స్పందించకపోతే, తాను జూలై 8న సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ కు వస్తానని, సీఎం రావాలని సవాల్ విసిరారు. పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు, జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు క్లబ్ లు కాంపౌండ్లు కాదు అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రండని పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ 8న తన పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ కి చేరారు. సీఎం సవాల్ స్వీకరించి తాను వచ్చానని, సీఎం కోసం తన పక్కనే ఒక సీటును ఖాళీగా పెట్టి మరీ, ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం అనూహ్యంగా కేటీఆర్ ఊసే లేకుండా, మాజ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అక్కడే రైతు రాజ్యంపై చర్చిద్దామని, కేసీఆర్ ఎలాంటి అగౌరవం కలగకుండా చర్చ చేద్దామన్నారు. ఆయన అనుభవాలను రాష్ట్ర ప్రగతికి ఉపయోగిద్దామన్నారు. ఆయన రానంటే ఆయన ఉన్న ఫాం హౌస్ కే తన మంత్రులను పంపుతానని, కాదంటే తానే స్వయంగా వస్తానని సుతిమెత్తగా సవాల్ విసిరారు. ఈ సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమై, చర్చగా మారింది.

సాధారణంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధుల చర్చకు అసెంబ్లీయే అసలైన వేదిక కావడంతో సీఎం చేసిన సవాల్ న్యాయ, చట్టబద్ధంగానే కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, సాధారణానికి భిన్నంగా ప్రతిపక్షం చేయాల్సిన డిమాండ్ ను ప్రభుత్వమే చేయడం కొంత ఆశ్యర్యమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం ను ప్రెస్ క్లబ్ కి రమ్మనడం తప్పు కాదు. సీఎం ప్రెస్ క్లబ్ కి వెళ్ళడం కూడా తప్పు కాదు. కానీ ఇలాంటి సవాల్ పై చర్చకు వెళ్ళడం అసాధారమవుతుంది. బహుషా సీఎం ఎలాగూ రారనే కేటీఆర్ క్లబ్ ను వేదికగా ఎంచుకుని ఉంటారు. పైగా ఆయన షెడ్యూల్ ఢిల్లీలో ఉండటం మరో కారణం కావచ్చు.

కానీ, అనూహ్యంగా సీఎం స్పందించడం, నేరుగా తానే ఫాం హౌస్ కి వెళతానని చెప్పడం కేసీఆర్ ఫ్యామిలీ సహా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రైతు రాజ్యంపై అసెంబ్లీ, పార్లమెంట్ లో చర్చకు సిద్ధ’మన్న సవాల్ రూపంలో సీఎం రేవంత్ విసిరిన వలలో కేసీఆర్ కుటుంబం పడిందా? అనవసరంగా సీఎం సవాల్ కు కేటీఆర్ స్పందించారా? అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. కేటీఆర్ సీఎంకు విసిరిన సవాల్ సంబరం 24 గంటలు కూడా నిలవక ముందే సీఎం విసిరిన సవాల్ గులాబీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వస్తే అసెంబ్లీకి రా రానంటే చెప్పు నీవున్న కాడికే వస్తా. అదీ కాదంటే మా మంత్రులను పంపిస్తా… అనడం మామూలు సవాల్ గా మాత్రం కనిపించడం లేదని బీఆర్ఎస్ నేతలు కొందరు అంటున్నారు. గతంలో కేటీఆర్ ఫాం హౌస్ కు పోయి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన కేసులో బాధితుడిగా ఉన్న సీఎం, ఇప్పుడు కూడా అన్నంత పనీ చేస్తే ఏంటి? నిజంగానే మంత్రులనో పంపో, లేక తానే ఫాం హౌస్ కు వెళితే ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సీఎం రారని తెలిసీ, ప్రెస్ క్లబ్ లో చేసిని హడావుడి కంటే, ఇప్పుడు సీఎం చేసిన సవాల్ నే ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఏ విషయాన్నైనా తెగేదాకా లాగడం అవసరమా? ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసలే అసెంబ్లీకి వెళ్ళని ఈ పరిస్థితుల్లో ఈ సవాళ్ళు అవసరమా? అన్న ప్రశ్నలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా జరగకపోయినా, నిజంగానే సీఎం ఫాం హౌస్ కు వెళితే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుంది? మైలేజీ ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ లో మరో ఆసక్తి చర్చ జరుగుతోంది. వ్యవసాయ క్షేత్రం పోరాటం రేవంత్ రెడ్డికి కలిసే వస్తున్నదట. మొత్తానికి అసెంబ్లీ చర్చ ఫాం హౌస్ రచ్చగా మారడం సర్వత్రా రాజకీయ ఉత్కంఠగా మారింది.

Latest News

ప్రపంచ జనాభాలో మనమే నెంబర్ వన్!|EDITORIAL

ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్లు దాటింది. భారతదేశ జనాభా అధికారికంగా 146కోట్లకు చేరుకుంది. చైనా పకడ్బందీ జనాభా నియంత్రణతో 2వ స్థానానికి చేరుకుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు...

శుక్రవారం జూలై 11–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి రాత్రి 01.52 వరకు ఉపరి విదియ నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 06.18 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వైదృతి రాత్రి 08.21 వరకు ఉపరి విష్కంభ కరణం బాలవ పగలు 03.44...

పురుగుల మందే రైతుకు పెరుగన్నమాయెనా!|EDITORIAL

ఎద్దు ఏడ్చిన ఎవుసం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు? ఆరుగాలం కష్టపడే రైతు అంతకు ఎందుకు తెగిస్తున్నాడు? ప్రక్రుతి వైపరీత్యాలకు,...

గురువారం జూలై 10–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురు పూర్ణిమ తిధి శు.పౌర్ణమి రాత్రి 01.36 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా యోగం ఐంద్ర రాత్రి 09.02 వరకు ఉపరి వైదృతి కరణం భద్ర పగలు 03.16 వరకు ఉపరి బాలవ వర్జ్యం...

ఎన్డీఎ పక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యమేది!?|EDITORIAL

పేరుకే జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డిఎ). పరిపాలన మొత్తం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీదే. ఇంకా చెప్పాలంటే మోడీదే. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన ఎన్‌డిఎ పక్షాల పాత్ర...

బుధవారం జూలై 09–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురు మౌఢ్య నివృత్తి తిధి శు.చతుర్దశి రాత్రి 12.50 వరకు నక్షత్రం మూల తెల్ల 05 01 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం బ్రహ్మ రాత్రి 08.24 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి...

ఊహించని కలయిక!|PALLA RAJESHWAR REDDY| KOMMURI PRATHAP REDDY

PALLA| పల్లాను కలిసి KOMMURI| కొమ్మూరి పరామర్శ JANGAON| జనగామ POLITICS| రాజకీయాల్లో విమర్శ జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఊహించని కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే స్థానానికి...

‘వృక్షో రక్షతి రక్షితః!’|EDITORIAL

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం అర్ధం ‘ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ...

మీ‘మాంసం’!?|BJP|KONDA VISHWESHWAR REDDY

మాంసాహారులకు బీజేపీలో స్థానం లేదా!? అలా అయితే PARTY| పార్టీ ఎలా బలపడుతుంది? పైన MODI| మోడీ, ఇక్కడ నేను గెలిస్తే ఏం లాభం? రాజకీయ పార్టీగా బీజేపీది బలమైన స్థానం స్వార్థానికి వాడుకునే వాళ్లతోనే బలహీనం...

మంగళవారం జూలై 08–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిధి శు.త్రయోదశి రాత్రి 11.39 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.11 వరకు ఉపరి మూల యోగం శుక్ల రాత్రి 08.48 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ పగలు...

Greenary| పచ్చదనం, Women empowerment| మహిళా సాధికారత మా telangana government| ప్రభుత్వ బాధ్యత

వన మహోత్సవం–2025 ప్రారంభోత్సవంలో CM|సీఎం Revanth Reddy| రేవంత్ రెడ్డి Rangareddy District| రంగారెడ్డి జిల్లా, rajendranagar|రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో|university వన మహోత్సవం–2025ను రుద్రాక్ష మొక్క నాటి ముఖ్యమంత్రి...

Bjp Party|స్వంత పార్టీపై MP|ఎంపీ Konda Vishweshwar Reddy|కొండా సంచలన వ్యాఖ్యలు| Sensational Comments

Vikarabad| వికారాబాద్ District|జిల్లాలో BJP|బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. కార్యకర్తల్ని ఉద్దేశించి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News