వన మహోత్సవం–2025 ప్రారంభోత్సవంలో CM|సీఎం Revanth Reddy| రేవంత్ రెడ్డి
Rangareddy District| రంగారెడ్డి జిల్లా, rajendranagar|రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో|university వన మహోత్సవం–2025ను రుద్రాక్ష మొక్క నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణపై ప్రజల బాధ్యతను గుర్తుచేస్తూ, మహిళల సాధికారతపై ప్రభుత్వ కృషిని గురించి వివరించారు. వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పినట్లుగా ప్రకృతి మన జీవనంలోని అంతర్భాగమని సీఎం అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుననుసరించి, ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని, అలాగే అమ్మలు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలి. వాటిని మీ పిల్లల్లా సంరక్షించండి. అప్పుడు మాత్రమే తెలంగాణ పచ్చదనంతో నిండుతుంది అని సీఎం అన్నారు.
మహిళా సాధికారత విషయానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని తెలిపారు. ఇది మహిళలకు ఆర్థిక, సామాజిక స్వావలంబనకు దోహదం చేస్తుందన్నారు. ఆర్టీసీ ప్రయాణాల్లో ఉచిత సౌకర్యం కల్పించడం ద్వారా మహిళల చలనం పెరిగిందని, అదే సమయంలో 1,000 బస్సులను మహిళల చేత అద్దెకు తీసుకుని, వారిని యజమానులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించామన్నారు. హైటెక్ సిటీలో ఉన్న విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. పట్టణాల్లో నివసించే మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.
అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు గౌరవంగా బతకేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ అమలు కానుందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకు కేటాయించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని సీఎం ప్రకటించారు. సమాజానికి మంచి జరగాలంటే ప్రకృతితో పాటు మహిళల స్థానం అభివృద్ధి చెందాలన్నదే ఈ వనమహోత్సవం సందేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత పరంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా తెలిపారు.