Vikarabad| వికారాబాద్ District|జిల్లాలో BJP|బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. కార్యకర్తల్ని ఉద్దేశించి మీకు నిజమైన దేశభక్తి, దైవ భక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్‌లో చేరండి. రాజకీయాల్లోకి వచ్చేందుకు, బీజేపీ వంటి రాజకీయ పార్టీలో ఉండేందుకు మీరు అర్హులే కాదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా బీజేపీకి ప్రత్యేక స్థానం ఉన్నా, దానిని వ్యక్తిగత స్వార్థానికి వాడుకునే వాళ్ల చేతిలో పార్టీ బలహీనపడుతోందని ఆయన విమర్శించారు.
మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారా? అలా అయితే పార్టీ ఎలా బలపడుతుంది?” అని స్పష్టంగా ప్రశ్నించిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఇది ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ, అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నారు. అంతేకాదు, పైన మోడీ ఉన్నారు, ఇక్కడ నేనే గెలుస్తాను అని చెప్పుకోవడం కాదు. అధ్యక్ష పదవుల కోసం పోట్లాడే బదులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని కార్యకర్తలను ఉద్దేశించి పరోక్షంగా పలువురు నేతలపై విమర్శలు చేశారు.
ఇటీవల కాలంలో బీజేపీలో తీవ్ర అంతర్గత సంఘర్షణలు, భావజాల విభేదాలు బయటకు రావడాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. కొండా వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా బహిరంగంగా చర్చకు దారితీయవచ్చు.