Warangal East Consistituency|వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓసిటీ ప్రాంతంలో జరిగిన బీరన్న బోనాల పండుగలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనమెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ, బీరన్న బోనాల పండుగ ఓరుగల్లు ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ పండుగ సందర్భంగా వరంగల్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలతో కలసి తాను ఈ ఉత్సవంలో భాగస్వామిగా మారినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.