NITI AAYOG|నీతి అయోగ్ సమావేశంలో సీఎం|CM రేవంత్ రెడ్డి|REVANTH REDDY
దేశాన్ని 2047 నాటికి నెంబర్ వన్ సూపర్ పవర్‌గా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని అభినందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే స్పూర్తితో తెలంగాణ అభివృద్ధికి “TELANGANA RAISING|తెలంగాణ రైజింగ్ – 2047” ప్రణాళికను రూపొందించామని వెల్లడించారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దేశం దృష్టిని ఆకర్షించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్|OPERATION SINDOOR” విజయవంతంగా పూర్తవడం పట్ల మోదీ, భారత సైన్యానికి అభినందనలు తెలియజేశారు. 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్తాన్‌ను ఓడించి, దేశాన్ని రెండు భాగాలుగా విభజించిన చరిత్రను గుర్తు చేశారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని, అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో “తెలంగాణ రైజింగ్ – 2047” డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఇందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పారదర్శక పాలన వంటి నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం లక్ష్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉపవర్గీకరణ వంటి నిర్ణయాలను దేశంలో తొలిసారిగా అమలు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
తెలంగాణలో వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలు ఇప్పటికే అమలులో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, తెలంగాణ తన అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో విధానాలు రూపొందించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.లక్ష కోట్ల రుణాలు, పాఠశాలల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకివ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
సోలార్ పవర్ జనరేషన్‌లో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహిళల ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. యువతే దేశ భవిష్యత్తు అని, వారి ఆశయాల సాధన కోసం యూత్ పాలసీ అమలులో ఉందన్నారు. ఇప్పటివరకు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. నైపుణ్యాల కొరత కారణంగా నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో, యువతకు ఆధునిక స్కిల్ శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను ఆధునీకరించినట్లు వివరించారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు సాగుతోందని, మాదకద్రవ్యాల నిర్మూలనలో 139 దేశాల్లో నెంబర్ వన్‌గా నిలిచిన ఘనతను పొందినట్లు గుర్తు చేశారు. జూన్ 2 నుంచి “రాజీవ్ యువ వికాసం” పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి మద్దతు అందించనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్య ప్రయోజనమని, అప్పుల ఊబిలో నుంచి రైతులను బయటకు తీయాలనే లక్ష్యంతో 25.35 లక్షల మందికి రూ.20,616 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా, క్వింటాల్ బియ్యానికి అదనంగా రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. వ్యవసాయ కూలీలకూ రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
తెలంగాణ ప్రస్తుతం వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని, గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ఉత్పత్తి నమోదై ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయ వ్యయాన్ని సంక్షేమ ఖర్చుగా కాకుండా, ఆహార సంపదకు పెట్టుబడిగా చూడాలని దేశాన్ని కోరారు. తెలంగాణ రైజింగ్ – 2047 దిశగా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల్లో అంతర్జాతీయ స్థాయికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ముసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైల్ ఫేజ్-2, ఫ్యూచర్ సిటీ, మాన్యుఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్టుల మాదిరిగా ముసీ నది పునరుద్ధరణ ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, డ్రై పోర్ట్ నుండి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ ప్రెస్ హైవే వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైనవని తెలిపారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా BUILD NOW యాప్ ద్వారా నిర్మాణ రంగాన్ని వేగవంతం చేశామని, హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్య, వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాల లక్ష్యంతో ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH
“వికసిత భారత్ లక్ష్య సాధన మనందరి కల. ఆ కలను నిజం చేయడంలో తెలంగాణ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నది మా ఆశయం. ‘నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్’ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాల సమాఖ్య అయిన భారత దేశంలో కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. తెలంగాణ రైజింగ్ విజన్‌కు కేంద్రం సహకరించాలి. వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందున్న రాష్ట్రంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నా” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.|VIKASITH BHARAT|TELANGANA|NITI AAYOG|CM|REVANTH REDDY|TELANGANA RAISING|OPERATION SINDOOR|SPEECH