Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఇక చాలు!?|STOP

ISSUES| వి‘వాదా’లను వదిలేయండి
PANCHAYAT| పంచాయితీలు పక్కన పెట్టండి
పంచాయతీలపై దృష్టి పెట్టండి
మీ SERVICES| సేవలు పార్టీకి అవసరం
PARTY| పార్టీ కోసమే పని చేయండి
LOCAL| ‘స్థానికం’గా సత్తా చాటాలి
KONDA| కొండా దంపతులకు MEENAKSHI| మీనాక్షి హితవు
పార్టీకి కట్టుబడి పని చేస్తాం: మీనాక్షికి కొండాల సంజాయిషీ
వివరణతో కూడిన నివేదిక అందజేత
నేనే తప్పూ చేయలేదు : MINISTER| మంత్రి కొండా సురేఖ| KONDA SUREKHA
కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు : కొండా మురళి| KONDA MURALI
SUSMITHA| సుస్మిత ఆలోచనలు వంశపారంపర్యం కావచ్చు అధిష్టానం ఆదేశాల మేరకే ఎన్నికల్లో పోటీ
నేనెవరికీ భయడనంటూ MEDIA| మీడియాతో వ్యాఖ్యలు
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

మొత్తానికి కాంగ్రెస్ లో కొండా దంపతుల వివాదాలకు తెరపడిందా? ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక పుణ్యమాని రాజీ కుదరిందా? 5వ తేదీతో ముడిపడిన సమస్య 3వ తేదీతోనే ముగిసిందా? నేను మానార్క్ ని, నేనెవరి మాటా వినను. నన్నెవరూ మోసం చేయలేరనే కొండా మురళి పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ మాట విన్నారా? కొండా దంపతులతోపాటు, వారి ప్రత్యర్థుల మధ్య సర్దుబాటు జరిగిందా? ఏం జరిగిందో కానీ, కొండా దంపతులకు భవిష్యత్ దర్శనం జరిగినట్లుంది. మీనాక్షి నటరాజన్ గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది. ఇక చాలు! వివాదాలను వదిలేయండి. పార్టీ కోసం పని చేయండి. మిగతా సమస్యలు నాకు వదిలేయండి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరంగా మాట్లాడొద్దు. పార్టీని ఇరకాటంలో పెట్టొద్దు. మీరు ఇరకాటంలో పడొద్దు. పని చేస్తూ పోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పార్టీకి కట్టుబడి పని చేస్తామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకు వస్తామని కొండా దంపతులు మీనాక్షికి మాట ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వివరణతో కూడిన ఫిర్యాదును సంజాయిషీ రూపంలో ఇచ్చి సమస్యను సద్దుమణిగే విధంగా చూసుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే బయటకు వచ్చాక యథావిధిగా కొండా దంపతులు తగ్గేదేలే? అన్నట్లుగా కొద్దిగా తగ్గి మీడియాతో మాట్లాడారు. తమ బిడ్డ సుస్మిత పోస్టును ఆమె ఇష్టానికి వదిలేసి, ఆమె తమ వంశపారంపర్యంగా ఆలోచిస్తున్నట్లుందని ముక్తాయించారు.

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
క్రమశిక్షణ కమిటీ పరిధిలోనే తానున్నా తనను కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు. పనిచేసే వాళ్ళపైనే రాళ్లు రువ్వుతారని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. తన విషయంలో 44 ఏళ్ళుగా ఇది కొనసాగుతూనే ఉన్నదని తెలిపారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని వెల్లడించారు. తన సతీమణి, మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గ్రూప్‌ రాజకీయ పరిణామాలపై వివరించారు. తాజా పరిణామాలపై 16 పేజీల లేఖ అందించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను, పార్టీలో తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఒకరి గురించి నేను కామెంట్‌ చేయను. నాకు ప్రజాబలం ఉంది. చాలా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నా’నని మరోసారి ఉద్ఘాటించారు. ‘నేను పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తారు. పనిచేసే వారిపైనే కొందరు రాళ్లు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. నేను ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్‌ వచ్చేలా చూస్తాం. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌తో చెప్పా. మా సేవల్ని పార్టీ ఉపయోగించుకోవాలని కోరాం. పార్టీకీ మీ సేవలు అవసరమని మీనాక్షీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం. రేవంత్‌రెడ్డిని ఇంకో పదేండ్లు ముఖ్యమంత్రిగా చూడాలి. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అండగా నిలుస్తా.’ అని మురళి చెప్పారు.

నేనే తప్పూ చేయలేదు : కొండా సురేఖ
తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాని చెప్పారు. తన శాఖలో ఉన్న ఫైల్స్‌ అన్నీ పరిశీలించుకోవచ్చని, మంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదని వెల్లడించారు.

సుస్మిత ఆలోచన వంశపారంపర్యం కావచ్చు
తన కూతురు సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖల రక్తమని, ఆమెకు తమ ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సురేఖ అన్నారు. ఆమె రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమని చెప్పారు. భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం ఆమెకు ఉందని, ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని ఆమె చెప్పారు.

మొత్తానికి మీనాక్షి నటరాజన్ జోక్యంతో కొండా దంపతులు, పార్టీ నేతల మధ్య నెలకొన్న సమస్య సద్దుమణిగింది. తాత్కాలికంగానైనా సర్దుబాటు జరిగింది. ఇరు వర్గాలను హెచ్చరించి దారికి తెచ్చింది. అయితే, పార్టీ హెచ్చరికలతో ఇరు వర్గాలు గప్ చుప్ గా ఎంత కాలం ఉంటాయన్నది వేచి చూడాలి.
…..

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News