షా మాటలు DEMOCRACY| ప్రజాస్వామ్యంపై తూటాలు
TELANGANA| తెలంగాణలో GUN DOWN| కాల్పుల విరమణ ప్రకటించాలి
PEACE| శాంతి చర్చలకు GOVERNMENT| ప్రభుత్వాలు సిద్ధం కావాలి
RELEASE| విడుదల చేసిన LETTER| లేఖలో MAOIST CENTRAL COMMITTEE| మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్‌తోనైనా చర్చలు జరుపుతామని చెప్పే ప్రభుత్వం, దేశీయ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో మాత్రం చర్చలకు సిద్ధంగా లేదనడం అన్యాయమన్నారు. అలాగే తెలంగాణలో కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూన్ 29న నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా చేసిన మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నది, 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభయ్ పేర్కొన్నారు. మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వస్తున్నారని, వారికి, బలగాలతో కలసి చర్చలు జరిపేందుకు మానవీయమైన దృష్టితో చూడాలని చెప్పారు.
మావోయిస్టు పార్టీ ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నదని, మార్చి 28న తెలంగాణలో భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కాల్పుల విరమణ ప్రకటించామని గుర్తు చేశారు. అయినప్పటికీ, కేంద్ర బలగాలు దాడులు ఆపడం లేదన్నారు. కాల్పుల విరమణ చేసినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో 85 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్(హత్య) చేశారని, అందులో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు నేతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇది కేవలం మావోయిస్టులను మట్టుబెట్టే ప్రయత్నం మాత్రమే కాదని, వేలాది ఆదివాసీల భూములను లాక్కొనే కుట్ర కూడా అని అభయ్ ఆరోపించారు. గడ్చిరోలీలో లక్షకు పైగా చెట్లు నరికి కార్పొరేట్ లాభాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందన్నారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా మేధావులు, హక్కుల కార్యకర్తలు, శాంతి ప్రేమికులు చర్చలకు మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ శాంతి చర్చల కమిటీ నేతలు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ ముఖ్యమంత్రిని కలసి చర్చల మార్గాన్ని సూచించినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించలేదన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటే రాష్ట్రమే ముందుగా ఆ వాతావరణం సృష్టించాలి అని సూచించారు. అమిత్ షా ప్రకటనలను ఖండించిన కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను అభయ్ స్వాగతించారు. మావోయిస్టులు కూడా భారత పౌరులేనని, వారితో చర్చల కోసం ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు.
ఆదివాసీల హక్కులు, వారి భూములు, అడవులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని, వామపక్షాలు, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు కలసి ఉద్యమాన్ని కొనసాగించాలని అభయ్ పిలుపునిచ్చారు.