Gaden fundrag trust| గదెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే అధికారమని వెల్లడి
తాను death| మరణించిన తర్వాత కూడా తన వారసుడు ఉండబోతున్నారని, ఆయన గుర్తింపు హక్కు పూర్తి స్థాయిలో గదెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే ఉందని దలైలామా ప్రకటించారు. భవిష్యత్తులో తన తరువాత ఎవరిని ప్రకటించాలో నిర్ణయించేది ట్రస్టే తప్ప మరెవరూ కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఇతరులు ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. టిబెటియన్ బౌద్ధమతంలో వారసత్వ నియామక ప్రక్రియపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. దలైలామా తరువాత ఎవరు అనే ప్రక్రియపై గత కొన్నేళ్లుగా చైనా-టిబెట్ మధ్య రాజకీయ వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.