కోవిడ్ టీకాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, హార్ట్ అటాక్‌లు వస్తాయన్న వాదనలను కేంద్రం తిప్పికొట్టింది. దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 47 ప్రముఖ ఆసుపత్రుల్లో జరిగిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ స్టడీ నిర్వహించబడింది. గుండె సంబంధిత సమస్యలకు టీకాలు కాకుండా, జీవనశైలి, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణాలని అధ్యయన నివేదిక పేర్కొంది. టీకాలపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ నివేదిక దోహదం చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు టీకాలపై నమ్మకాన్ని కొనసాగించాలని అధికారులు తెలిపారు.