Today| నేటి నుంచి 9వ తేదీ వరకు విదేశీ యాత్ర| foreign tour
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి జూలై 9వ తేదీ వరకు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్, టోబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా దేశాధినేతలతో కీలక సమావేశాలు, ఒప్పందాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సహకారంపై దృష్టి సారించేలా ప్రధాని పర్యటనను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. పర్యటన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.