బీజేపీ ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ క్రియాశీల సభ్యుల సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు మారం రవి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పలువురు నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 06 తారీకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ 22వ తారీకు వరకు అనేక కార్యక్రమాలు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు స్వచ్ఛ, భారత్, గావ్ చలో బస్తీ చలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు దుంపల సంపత్, మండల ప్రధాన కార్యదర్శులు వేల్పుల దేవరాజు, పెనుగొండ సోమేశ్వర్, కొడిశాల యాదగిరి, బీజేవైఎం జిల్లా నాయకులు పూజారి మహేష్,గిరిజన మోర్చ మండల అధ్యక్షలు లకావత్ రవి,బోనగిరి శ్రీనివాస్,బూత్ ఆధ్యక్షులు చిక్కుడు అశోక్,బెల్లి సతీష్,యాదగిరి, కొమురయ్య,బాధావత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు