బీజేపీ మరోసారి బీసీ లకు అన్యాయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ముగ్గురు బీసీ ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నారు. బీసీ నాయకుడి నామినేషన్‌ను అడ్డుకోవడం అన్యాయమని, పార్టీకి నియంతృత్వ ధోరణి కలిసిందని మండిపడ్డారు. గతంలో బీసీ సీఎం హామీ ఇచ్చి సభాపక్ష నాయకుడినైనా ఇవ్వలేదని గుర్తు చేశారు. బీజేపీ ఫ్యూడల్ పార్టీగా బీసీలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తుందని, సీఎం రెవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడిని బీసీ వ్యక్తిని చేసినదే కాక, కుల గణన ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించిందన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయ పోరాటానికి నినాదం ఎత్తుకున్నారని తెలిపారు.