New| నూతన Presidents| అధ్యక్షులతో BJP| బీజేపీకి కలిసొచ్చేనా…
Eatala Rajender| ఈటెలకు ఊహించని దెబ్బ అంటూ … ప్రచారం
Telangana| తెలంగాణ ఆధ్యక్షుడి ఎంపికలో AP CM| ఏపీ సీఎం MARK| మార్క్ ఉందంటూ… మరో ప్రచారం |CAMPAIGN
అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ mla| ఎమ్మెల్యే రాజా సింగ్ |Raja Singh
Andhrapradesh| ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల ఎంపికలో పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఊహించిన పేరులకు భిన్నంగా, ఆశించని, ఊహించని అభ్యర్థులను ఎంపిక చేస్తూ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావును ఎంపిక చేసిన విధానం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ఏపీలో పీవీఎన్ మాధవ్ ఎంపికపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఆయనకు ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఈ ఎంపికకు బలమైన కారణాలు అని తెలుస్తుంది. మాధవ్ బీసీ వర్గానికి చెందినవారు, పార్టీ బలం పెరిగి, అన్ని వర్గాల వారికి బీజేపీ సమ న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన తండ్రి పీవీ చలపతి రావు కూడా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడం ఈ ఎంపికను మరింత బలపరిచింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ సమీకరణాల మధ్య బీజేపీని ఒక బలమైన పార్టీగా నిలిపేందుకు మాధవ్ లాంటి మృదువైన నేత అవసరమన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది.
తెలంగాణలో మరింత ఆసక్తికరంగా నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ వంటి బలమైన నాయకుల్ని పక్కనపెట్టి సీనియర్ నేత రామచందర్ రావుకు అవకాశమివ్వడంపై పార్టీ వర్గాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. ఎబివిపి నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, బీజేపీకి ఎనలేని సేవలందించిన ఆయన ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తించారు. మృదుస్వభావంతో, అందరినీ కలుపుకుపోయే లక్షణంతో రామచందర్ రావు ఎంపిక పై ఆర్ఎస్ఎస్ స్థాయిలో ఆమోదం పొందినట్లుగా తెలుస్తోంది. పార్టీ నైతిక విలువలపై ఆయనకు ఉన్న నిబద్ధత, కార్యకర్తలతో ఉన్న అనుబంధం, రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన ఆయన ఎంపికకు కారణం అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
ఏపీ సీఎం మార్క్ ఉందా?
అయితే ఈ ఎంపికపైమరో పెద్ద రాజకీయ అంశం చర్చనీయాంశమవుతోంది. రామచందర్ రావు ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రభావం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఆయనకు సన్నిహితుడిగా పేరున్న రామచందర్ రావును ఎంపిక చేయడం వెనక చంద్రబాబు పాత్ర ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఈటల రాజేందర్‌కు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాజా సింగ్
ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని నావాడు, నీవాడు అంటూ ఎవరి సలహాలో వింటూ నియమించుకుంటే పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. బీజేపీలో నాయకుడిని బూత్ స్థాయి నుంచి ముఖ్య నాయకుడి వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మకంగా, అందరినీ సమన్వయపరచగల నేతలను ఎంపికచేసినట్లు సంకేతాలు పంపిస్తోంది.
https://youtu.be/Ijlzc2xlW3w?feature=shared
ఈ మార్పుతో బీజేపీలో కూడా మార్పు ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది పార్టీకి కొత్త ఊపు ఇచ్చే అవకాశం అయినప్పటికీ, అసంతృప్తి వర్గాలను సర్దుబాటు చేస్తారా..లేదా… వివాదాలకు కారణం అవుతారా… అనేది భవిష్యత్ నిర్ణయించాల్సిందే.