అమరచింతలో SAI CHAND| సాయిచంద్ విగ్రహావిష్కరణ |STATUE INAGURATION
కళా ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళి |TRIBUTE
MAHABUBNAGAR| మహబూబ్ నగర్ జిల్లా అమరచింత గ్రామంలో తెలంగాణ ప్రజానాట్య పరిషత్తు నాయకుడు, ప్రఖ్యాత గాయకుడు, మాజీ కార్పొరేషన్ |CARPORATION చైర్మన్ దివంగత సాయిచంద్ స్మృతికి అంజలిగా రెండవ వర్ధంతి |SECOND DEATH ANNIVERSARY సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు టీ. హరీశ్ రావు, డా.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వీ. శ్రీనివాస్ గౌడ్, సాయిచంద్ సతీమణి రజిని సాయిచంద్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి, అల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, పలు నియోజకవర్గాల పార్టీ నేతలు, కళా సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
సాయిచంద్ సేవలను గుర్తుచేసుకుంటూ, నాయకులు ఆయన విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. ప్రజానాట్య కళను ఉద్యమానికి ఆయుధంగా మార్చిన ఆయన స్వరం, భావపూర్వక గానం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నాటుకుపోతుందని వారు తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సాయిచంద్ గానం… ఉద్యమానికి ప్రాణం. ఆయన గొంతు నినాదమైంది. తరతరాల వారికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు అని అన్నారు. అలాగే సాయిచంద్ ఓ కళాకారుడికంటే ఎక్కువ, ప్రజల కోసం జీవించిన నేత. ఆయన జ్ఞాపకాలు శాశ్వతంగా నిలుస్తాయి అని పేర్కొన్నారు.
సాయిచంద్ సతీమణి రజిని మాట్లాడుతూ, వారిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, వారి చిరునవ్వు నన్ను ప్రతిరోజూ ముందుకు నడిపిస్తోంది. ఆయన సమాజానికే జీవిత భాగస్వామిగా ఉన్నారు అని భావోద్వేగంగా చెప్పారు. విగ్రహావిష్కరణ అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుక వైభవంగా సాగింది.