తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఐఏఎస్ అధికారులకు ఎఫ్‌ఏసీ (FAC) బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కమిషనర్ శ్రీ కే. శశాంక (IAS 2013)ను TGIIC ఉపాధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD) గా తాత్కాలిక బాధ్యతలతో నియమించగా, ఈ పదవి నుంచి డాక్టర్ ఈ. విష్ణు వర్ధన్ రెడ్డి (IFS 2008)ను రిలీవ్ చేశారు.
అదేవిధంగా, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్మిత్ వల్లూరు కాంతి (IAS 2016)ను మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఎఫ్‌ఏసీగా నియమించారు. ఈ పదవిలో నుండి కే. శశాంకను మార్చారు. ఇక, ఎస్‌ఇఆర్‌పీ అడిషనల్ సీఈఓగా ఉన్న శ్రీమతి పి.కాత్యాయనీ దేవి (IAS 2017)ను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్‌ఏసీగా నియమించారు. ఖమ్మంలో ఎమ్మెపిఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీ పి. మహేందర్‌ను రంగారెడ్డి జిల్లాలోని FCDAలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.